'ప్రజలు చూస్తున్నారు రాహుల్‌.. ఆపుతావా' | Sakshi
Sakshi News home page

'ప్రజలు చూస్తున్నారు రాహుల్‌.. ఆపుతావా'

Published Sat, Jan 13 2018 9:49 AM

Dont Politicise: BJPs Advice To Rahul Gandhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు వ్యవహారంలో ఏ రాజకీయ పార్టీ జోక్యం చేసుకోవద్దని బీజేపీ హెచ్చరించింది. కాంగ్రెస్‌ పార్టీ ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిదని హితవు పలికింది. సుప్రీంకోర్టు సీనియర్‌ జడ్జీలు నలుగురు ప్రధాన న్యాయమూర్తిపై దిక్కార స్వరం వినిపిస్తూ మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ స్పందిస్తూ పరోక్షంగా బీజేపీపై ఆరోపణలు చేసింది.

అదే సమయంలో రెండు పేజీల లేఖను విడుదల చేసి నలుగురు న్యాయమూర్తులు చేసిన ఆరోపణలపై జడ్జీలంతా కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. దీనిని బీజేపీ ఖండిస్తూ 'న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశాలను మనలో ఏ ఒక్కరం కూడా రాజకీయం చేయొద్దు. కాంగ్రెస్‌ పార్టీ ఇది మా సలహా. కాంగ్రెస్‌ పార్టీ కావాలని అతిచేస్తుందనే విషయాన్ని దేశ ప్రజలంతా చూస్తున్నారు' అంటూ బీజేపీ ఓ ప్రకటన చేస్తోంది.

Advertisement
Advertisement