ఏపీ ఎంపీల ఆందోళనకు మా మద్దతు: ఎంపీ కవిత | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 8 2018 5:17 PM

fulfill reorganization act promises, trs mp kavitha appeals centre - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆమె గురువారం లోక్‌సభలో మాట్లాడారు. ఏపీ అన్యాయంపై ఆ రాష్ట్ర ఎంపీలు చేస్తున్న ఆందోళనకు కవిత మద్దతు పలికారు. పార్లమెంటులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ ఎంపీల ఆందోళనలకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. అయితే, ప్రభుత్వంలో ఉండి నిరసనలు తెలుపడం సరైన పద్ధతి కాదని ఆమె పరోక్షంగా టీడీపీ ఎంపీలను ఉద్దేశించి పేర్కొన్నారు. కేంద్రం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. జీఎస్టీ, నోట్లరద్దుకు తాము మద్దతునిచ్చామని, తెలంగాణకు కేంద్రం మద్దతునివ్వాలని అభ్యర్థించారు. కేంద్రం ఎరువుల సబ్సిడీని నేరుగా రైతులకు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ఫర్టిలైజర్‌ కంపెనీల విషయంలో కాంగ్రెస్‌ చేసిన తప్పులనే బీజేపీ ఎందుకు చేస్తోందని అన్నారు.

Advertisement
Advertisement