పోలవరం మోదీ ఇచ్చిన వరం: హరిబాబు | Sakshi
Sakshi News home page

పోలవరం మోదీ ఇచ్చిన వరం: హరిబాబు

Published Sat, Apr 28 2018 8:01 PM

Hari Babu Fires On  Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన వరమని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. ప్రాజెక్టుకు అడ్డు లేకుండా తెలంగాణ ప్రాంతంలోని ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ ఆర్డినెన్స్‌ జారీ చేయడంతోనే పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం ముందుకొచ్చిందని తెలిపారు. ముంపు మండలాలపై రెండు కళ్ల సిద్దాంతాన్ని అనుసరించింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. విభజన  సమయంలో టీడీపీ ద్వందనీతిని అనుసరించిందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్రంపై నిందలు వేయడం సరికాదన్నారు.

కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి రాకుండా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అది కాంగ్రెస్‌కు మేలు చేసినట్లవుతుందన్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌కి టీడీపీ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు. అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన పార్టీలు మోదీని విమర్శిస్తున్నాయని, వారితో చంద్రబాబు ఎలా చేతులు కలుపుతారని హరిబాబు ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఏమి చేయలేని టీడీపీ ప్రభుత్వం బీజేపీపై నిందలు వేస్తూ పబ్బం గడుతుంతోదని ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ  ఎమ్మెల్యేలను ప్రభుత్వంలోని తీసుకుని చంద్రబాబు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుతున్నారని విమర్శించారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement