రాజన్న బిడ్డకు కష్టం చెప్పుకుందాం.. | Sakshi
Sakshi News home page

రాజన్న బిడ్డకు కష్టం చెప్పుకుందాం..

Published Sun, Dec 17 2017 1:32 AM

Huge people to the leader jagan padayatra - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర శనివారం 500 కిలోమీటర్లు దాటింది. ‘రాజన్న బిడ్డ మనూరి మీదుగా పోతున్నాడు.. ఒక్కసారి చూ ద్దాం’అంటూ అవ్వ తాతలు.. ‘అన్నొస్తున్నాడు.. ఎలాగైనా సరే షేక్‌ హ్యాండ్‌ తీసుకోవాల్సిందే’ అంటూ యువకులు.. ‘అన్నకు హారతి పట్టా లి..’అంటూ అక్క చెల్లెళ్లు పోటీ పడటంతో యాత్ర సాగిన రహదారి జనంతో కిక్కిరిసింది. పాదయాత్ర 36వ రోజు అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని చిగిచెర్ల నుంచి ఉదయం 8.30 గంటలకు మొదలైంది. చిన్నా పెద్దా... ముసలి ముతకా తేడా లేకుండా భారీగా జనం తరలివచ్చా రు. ఉదయం నుంచి రాత్రి వరకూ జగన్‌తో పాటు అడుగు కలిపారు. జగన్‌.. చిగిచెర్లకు చేరుకోగానే మహిళలు హారతి పట్టారు.

ఆ తర్వాత వసం తాపురంలో జ్యోతి, నారాయణమ్మ తదితర ఉపాధి హామీ కూలీలు జగన్‌ను కలిశారు. వారం రోజులు పనిచేస్తే రూ.వంద మాత్రమే కూలీ ఇచ్చారని వాపో యారు. చేనేత కార్మికులు మగ్గం బహూకరిం చారు. అనంతపురానికి చెందిన న్యాయవాదులు జననేతను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. తమ సమస్యలను వివరిస్తూ పరిష్కారానికి సహకరిం చాలని కోరారు. అర్హత ఉన్నప్పటికీ పింఛన్‌ ఇవ్వడం లేదని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ లో లైసెన్స్‌లు ఉన్నా టీడీపీ నేతలు అక్రమంగా దుకాణాలు నడుపుతూ తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని కల్లు గీత కార్మికులు ఫిర్యాదు చేశారు. పాదయాత్ర బడన్నపల్లికి చేరుకోగానే జగన్‌కు ఘన స్వాగతం లభించింది. దారిపొడవునా బంతిపూలు పరిచారు. ఇళ్లముందు రంగుల ముగ్గులు వేశారు. వైఎస్సార్‌సీపీ జెండా ఆవిష్కరించి శాంతికపోతాన్ని ఎగురవేశారు. మల్కాపురం క్రాస్‌ వద్దకు పాదయాత్ర చేరుకోగానే ధర్మవరం టీడీపీ మైనార్టీ కీలక నేత అబ్దుల్‌రవూఫ్‌ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. గొట్లూరు చేరుకోగానే యాత్ర 500 కిలోమీటర్ల మైలు రాయిని చేరినందుకు గుర్తుగా జగన్‌ గ్రామంలో వక్క మొక్కను నాటారు. గంటల తరబడి వేచి ఉన్న మహిళలు, వృద్ధులు జగన్‌ కన్పించగానే పరుగున చెంతకు చేరారు. అందరినీ జగన్‌ ఆప్యాయంగా పలకరించారు. జగన్‌ ఆప్యాయతకు ‘నువ్వు సల్లంగా ఉండాలి నాయనా.. ఆరోగ్యం జాగ్రత్త’అని దీవించారు. 

జనమే జనం 
కిలోమీటర్ల పొడవునా జగన్‌ కోసం జనం బారులు తీరారు. సమస్యలు చెప్పుకునేందుకు, చేయి కలిపేందుకు, కలిసి నడిచేందుకు పోటీపడ్డారు. పాత్రికేయ సంఘాల ప్రతినిధులు, రైతులు, కూలీలు, మహిళలు, యువకులు అభిమాన నేతకు సంఘీభావంగా నిలిచారు. దళిత, బీసీ సంఘాలు ఆయనతో కలిసి నడిచాయి.

పార్టీ సైనికుడి ఇంటికి సారధి
బడన్నపల్లిలో ఇటీవల హత్యకు గురైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థానిక నేత చిన్నారెడ్డి ఇంటికి జగన్‌ వెళ్లారు. గుండె పగిలిన ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న చిన్నారెడ్డి కుమార్తెలను ఓదార్చారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జన నేత కళ్లలో నీళ్లు తిరిగాయని అక్కడున్న మహాలక్ష్మి చెప్పింది. ఆ ఉద్వేగభరిత సన్నివేశం ఆ ఊర్లో ఇపుడు చర్చనీయాంశమైంది. ఓ సాధారణ కార్యకర్త ఇంటికి అంత పెద్ద నాయకుడు రావడం నిజంగా కలగానే ఉందని స్థానికుడు రమేష్‌ అన్నాడు. పాదయాత్రలో రోజూలాగే అడుగడుగున జగన్‌కు సమస్యలు స్వాగతం పలికాయి. పదిసార్లు దరఖాస్తు చేసినా పింఛను ఇవ్వలేదయ్యా అంటూ కుళ్లాయప్ప అనే వికలాంగుడు వాపోయాడు. భర్త చనిపోయి ఐదేళ్లయినా పింఛను ఇవ్వలేదని గంగమ్మ అనే మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. తాటి చెట్టు పైనుంచి పడి కాళ్లు, చేతులు పని చేయడం లేదని ఈ సర్కారును వేడుకున్నా పట్టించుకోలేదని ఓబులేసు అనే వికలాంగుడు బావురుమన్నాడు. ఇలా.. అడుగడుగునా కన్నీళ్ల వెతలే. అభాగ్యుల గుండెకోతలే. అందరి సమస్యలనూ జగన్‌ సావధానంగా విన్నారు. కొన్నింటికి పరిష్కారం చూపారు. మరికొన్ని మన ప్రభుత్వం వస్తే పరిష్కారమవుతాయని తెలిపారు. ఈ భరోసా వాళ్లకు కొండంత ధైర్యాన్నిచ్చింది. 

టీడీపీలో కలవరం
ప్రజా సంకల్ప యాత్రకు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతుండటంతో అధికార పార్టీలో కలవరం మొదలైంది. యాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో దిక్కుతోచని సర్కారు పెద్దలు నిఘా వర్గాలను రంగంలోకి దింపారు. జనం ఎందుకిలా వస్తున్నారంటూ ఆరా తీశారు. తమ పట్ల ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోందన్న నివేదికలు అందుకుని ఆందోళనలో పడ్డారు. పాదయాత్రకు వెళ్లొద్దని ఆ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ జనం లెక్కచేయక తండోప తండాలుగా తరలిరావడం గమనార్హం. ధర్మవరం నియోజకవర్గంలో జనమంతా జననేత యాత్ర గురించే వారం రోజులుగా చర్చించుకుంటున్నారు. ఆయనతో కలిసి నడవాలని ఆరాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ కేడర్‌ చేజారిపోకుండా తెలుగుదేశం పార్టీ అనేక ప్రయత్నాలు చేసింది. గొట్లూరు ఎంపీటీసీ సభ్యుడు వైఎస్సార్‌సీపీలోకి వెళ్తున్నట్టు సంకేతాలు అందడంతో రాత్రికి రాత్రే అతన్ని అజ్ఞాతంలోకి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కేడర్‌ను కనుసన్నల్లో పెట్టుకున్నా ప్రజలను మాత్రం పాదయాత్ర బాట పట్టకుండా ఆపలేకపోయారని బత్తలపల్లికి చెందిన రమేష్‌ అన్నారు.

Advertisement
Advertisement