ప్రశ్నిస్తే గృహ నిర్బంధం చేస్తారా?: ఉమ్మారెడ్డి | Sakshi
Sakshi News home page

ప్రశ్నిస్తే గృహ నిర్బంధం చేస్తారా?: ఉమ్మారెడ్డి

Published Wed, Jan 10 2018 1:33 AM

Janamabhoomi Programme turns a TDP event, says ummareddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐదోవిడత జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి ఇప్పటి వర కూ ఏడున్నర లక్షలకు పైగా అర్జీలు వచ్చా యంటేనే గత నాలుగేళ్లలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని అర్థమని ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంక టేశ్వర్లు అన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జన్మ భూమి కార్యక్రమాలు రసాభాసగా జరుగు తున్నాయని, ప్రశ్నించే వారిని సభల్లో ఉండనివ్వడం లేదన్నారు. సమస్యల పరి ష్కారం కోసం జన్మభూమి కార్యక్రమా లకు వెళ్తున్న ప్రతిపక్షనేతలను హౌస్‌ అరెస్టులు చేయడం దారుణమన్నారు.

కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కోల వెన్నులో జన్మభూమి సమావేశానికి వెళ్తు న్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేత కొలుసు పార్థ సార«థిని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ప్రభుత్వంలో ఉలికిపాటు మొదలైందన్నారు. ఇప్పటికైనా నాలుగు దఫాలుగా జరిగిన అర్జీలన్నీ ఏ మేరకు పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.‘జన్మభూమి–మాఊరు’కార్యక్రమంలో ప్రభుత్వం ఖర్చుతో టీడీపీకి ప్రచారం చేసుకుంటున్నారని ఉమ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నాలుగు జన్మభూమి కార్యక్రమాల్లో వచ్చిన అర్జీలలో ఏ మేరకు నెరవేర్చారో యాక్షన్ టేకన్‌ రిపోర్టు (ఏటీఆర్‌)ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement