నేటి నుంచి కేసీఆర్‌ ప్రచారం | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కేసీఆర్‌ ప్రచారం

Published Sun, Dec 2 2018 1:39 AM

KCR campaign from today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మూడోదశ ప్రచారం ఆదివారం నుంచి మొదలుకానుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసే డిసెంబర్‌ 5 వరకు వరుసగా కేసీఆర్‌ ప్రచారం కొనసాగనుంది. రోజూ సగటున 4 నుంచి 6 సభల్లో పాల్గొననున్నారు. నాగర్‌కర్నూల్, చేవెళ్ల, పటాన్‌చెరు, సికింద్రాబాద్‌లో ఆదివారం జరగనున్న సభల్లో కేసీఆర్‌ పాల్గొంటారు. హైదరాబాద్‌ నగర టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారసభను సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు.

గత ఎన్నికల సంప్రదాయాన్ని కొనసాగించేలా సొంత నియోజకవర్గం గజ్వేల్‌ బహిరంగ సభతో కేసీఆర్‌ ప్రచారం ముగించనున్నారు. ప్రచారం చివరి రోజు ఇక్కడ ప్రజా ఆశీర్వాదసభ జరగనుంది. ఆరోజు ఒక్కసభలోనే పాల్గొంటారా, మరికొన్ని సెగ్మెంట్లలో ప్రచారం చేస్తారా అనేది టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఇంకా నిర్ణయించలేదు.  

మేనిఫెస్టో ఉంటుందా!: కేసీఆర్‌ అక్టోబర్‌ 16న పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సికింద్రాబాద్‌లో నిర్వహించే హైదరాబాద్‌ నగర ప్రచారసభలో టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కేసీఆర్‌ ప్రచార షెడ్యూల్‌..
ఆదివారం: మధ్యాహ్నం 1.00: నాగర్‌కర్నూల్, 2:00: చేవెళ్ల, 3:00: పటాన్‌చెరు, 5:00: సికింద్రాబాద్‌ (పరేడ్‌గ్రౌండ్‌), సోమవారం: 12:00: సత్తుపల్లి, 1:00: మధిర, 1:45: కోదాడ, 2:30: హుజూర్‌నగర్, 3:30: మిర్యాలగూడ, 4:30: నల్లగొండ మంగళవారం: 12:00: ఆలంపూర్, 1:00: గద్వాల, 2:00: మక్తల్, 3:00: కొడంగల్, 4:00: వికారాబాద్‌.

Advertisement

తప్పక చదవండి

Advertisement