మోదీకి చంద్రబాబు భయపడతారేమో : కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 27 2018 5:09 PM

KCR Slams Congress Party In Haliya Public Meeting - Sakshi

సాక్షి, హాలియా : ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భయపడతారేమో కానీ తాను భయపడనని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ అన్నారు. మంగళవారం హాలియాలో జరిగిన ప్రజా ఆశీర్వాధ సభలో ఆయన ప్రసంగించారు. తానే తప్పు చేయలేదని.. ఎవరికీ భయపడనన్నారు. ‘ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. అందరి మాటలు వినండి.. చర్చించి ఓటేయ్యండి. తెలంగాణను ఆగం చేసిన టీడీపీ, కాంగ్రెస్‌లు ఒకవైపు.. నాలుగేళ్లలో అభివృద్ధి చేసిన టీఆర్‌ఎస్‌ వరోవైపు ఉంది. ఎన్నికల్లో గెలవాల్సిది పార్టీలు కాదు.. ప్రజలు. కులవృత్తులను ప్రోత్సహించాం. గొర్రెల సంపద పెరిగి గొళ్ల, కురుమలు బాగుపడ్డారు. ఈ విషయం కాంగ్రెస్‌ గొర్రెలకు అర్థం కాదు. గీతకార్మికులను అన్ని విధాల ఆదుకున్నాం.

కాంగ్రెస్‌ పాలనలో రైతులు ఎంతో బాధపడ్డారు. నీటీ తీరువా పన్ను రద్దు చేశాం. రెప్పపాటు కోతలు లేకుండా కరెంట్‌ ఇస్తున్నాం. రైతు బంధు, రైతు భీమా పథకాలు దేశానికే ఆదర్శం. గుంట భూమి ఉ‍న్న రైతు మరణిస్తే కూడా రూ.5లక్షల భీమా ఇస్తున్నాం. కంటి వెలుగు పథంకం ఎప్పుడైన ఊహించామా? భవిష్యత్తులో డెంటల్‌‌, ఈఎన్‌టీ డాక్టర్లతో పరీక్షలు చేయిస్తాం. నాగార్జున సాగర్‌లో 70 తండాలను గ్రామాలను చేసాం. ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్లు పెరగాలి. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే కేంద్రం అడ్డుకుంది. ఇవన్నీ ఆలోచించి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి.’ అని సీఎం కేసీఆర్‌ ప్రజలను కోరారు.

Advertisement
Advertisement