యూత్‌ కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడిగా కేశవ్‌ చంద్‌

11 May, 2018 20:21 IST|Sakshi
రాహుల్‌ గాంధీతో కేశవ్‌ చంద్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, ఢిల్లీ :  యువజన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కేశవ్‌చంద్‌ యాదవ్‌ ఎంపికయ్యారు. అలాగే తెలంగాణకు చెందిన బీవీ శ్రీనివాస్‌ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శుక్రవారం అమరీందర్‌ సింగ్‌ రాజా స్థానంలో కేశవ్‌ చంద్‌ను నియమించారు. ఈ మేరకు జనరల్‌ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీకి అమరీందర్‌ సింగ్‌ అందించిన సేవలను ప్రశంసించింది.

మరిన్ని వార్తలు