స్టాలిన్‌తో మమత మంతనాలు | Sakshi
Sakshi News home page

స్టాలిన్‌తో మమత మంతనాలు

Published Mon, Mar 5 2018 6:53 PM

Mamata Banerjee reaches out to Stalin, party says unity move on track - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు విపక్షాలను ఏకం చేసే పనిలో నిమగ్నమైన తృణమూల్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తో ఫోన్‌లో చర్చలు జరిపారు. ఎన్‌డీఏపై పార్లమెంట్‌ లోపల, వెలుపల సమిష్టి కార్యాచరణతో పోరాడటంపై ఇరువురు నేతలు చర్చించారు. భావసారూప్య పార్టీలతో సంప్రదింపులు జరిపి బీజేపీ ఓటమి లక్ష్యంగా వాటిని ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రక్రియ జరుగుతోందని తృణమూల్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌ చెప్పారు. టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌తో ఫోన్‌లో సంప్రదించిన మీదట మమతా బెనర్జీ..స్టాలిన్‌తోనూ మాట్లాడారన్నారు.

పార్లమెంట్‌లో సోమవారం పలు అంశాలపై టీఆర్‌ఎస్‌, టీడీపీ, ఎస్‌పీ, బీఎస్‌పీ, తృణమూల్‌, డీఎంకే సభ్యుల మధ్య మెరుగైన సమన్వయం నెలకొందని చెప్పారు. ఈశాన్యరాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ప్రాంతీయ పార్టీలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తృణమూల్‌ ఎంపీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Advertisement
Advertisement