చెరుకు సుధాకర్‌తో మందకృష్ణ భేటీ | Sakshi
Sakshi News home page

చెరుకు సుధాకర్‌తో మందకృష్ణ భేటీ

Published Wed, Mar 7 2018 2:07 AM

Manda krishna meeting with cheruku sudhakar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ అన్నారు. చెరుకు సుధాకర్‌తో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంగళవారం భేటీ అయ్యారు. ఈ నెల 13న నిర్వహించ తలపెట్టిన బంద్‌కు మద్దతు కోసం సుధాకర్‌ను కలసి మందకృష్ణ వినతిపత్రం అందించారు. వర్గీకరణ కోసం జాతీయస్థాయిలో ఉద్యమాన్ని తీవ్రం చేయాలని చెరుకు సుధాకర్‌ అన్నారు.

వర్గీకరణ కోసం జరుగుతున్న బంద్‌కు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని, ఇంటిపార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం రాత్రికి రాత్రే ఇతర రాష్ట్ర నేతలకు ఫోన్లు చేసిన సీఎం కేసీఆర్‌.. వర్గీకరణ కోసం ఎందుకు చొరవ తీసుకోలేదని ప్రశ్నిం చారు. మార్చ్‌ 10న మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి సభను నిర్వహిస్తామన్నారు. మార్చి 13న జరిగే బంద్‌కు అన్ని పార్టీలు, వర్గాలు మద్దతివ్వాలని మంద కృష్ణ కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement