నయా జోష్‌..! | Sakshi
Sakshi News home page

నయా జోష్‌..!

Published Thu, Jul 12 2018 11:58 AM

Manugunta Mahender Reddy Joins YSRCP Prakasam - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఇతర పార్టీల నుంచి ముఖ్య నేతల చేరికలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మరింత బలోపేతం అవుతోంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. తాజాగా పురపాలకశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి వైఎస్సార్‌ సీపీలో చేరారు. కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు, గుడ్లూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, కందుకూరు రూరల్‌ మండలాలు, కందుకూరు మున్సిపాలిటి పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, అనుచరులతో కలిసి మహీధర్‌రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న ప్రజా సంకల్ప పాదయాత్రకు వెళ్లారు.

అనపర్తి నియోజకవర్గం పందలపాకలో పాదయాత్రలో అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. ఆయనకు, అనుచరులకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డితో బుధవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో  కలిసిన మహీధర్‌రెడ్డిని, ఆయన అనుచరులను వైఎస్‌ జగన్‌ పార్టీ కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కందుకూరు నియోజకవర్గంలో ఐదు మండలాల్లోని ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ఆయన అనుచరులు ఆయన పార్టీలో చేరే సమయంలో పార్టీ అధినేతకు జేజేలు పలికారు. మహీధర్‌రెడ్డి వైఎస్సార్‌ సీపీలో చేరడంతో ఆ పార్టీలో మరింత జోష్‌ నెలకొంది. మహీధర్‌రెడ్డి రాకను జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులుస్వాగతిస్తున్నాయి. వైఎస్సార్‌ సీపీ జిల్లాలో మరింత బలోపేతం అయిందని వారు పేర్కొంటున్నారు.

ఐదు మండలాల నుంచి కాకినాడకుఅనుచరగణం..
మహీధర్‌ రెడ్డి పార్టీలో చేరిక సందర్భంగా మంగళవారం రాత్రికే కందుకూరు నియోజకవర్గం నుంచి పలువురు ఆర్టీసీ బస్సుల్లో కాకినాడ చేరుకున్నారు. మరికొందరు కార్లలో వెళ్లారు. గుడ్లూరు ఎంపీపీ ఐ.శ్రీనివాస్, తోకల కొండయ్య, సర్పంచిలు బత్తిన మదన్‌ మనోహర్, బూసిరెడ్డి నాగేశ్వరరెడ్డి, పాలూరి వెంకారెడ్డి, డాక్టర్‌ ప్రసాద్, రామాల సింగారెడ్డి, చెరుకూరి సూర్యనారాయణ, మునగల మాలకొండారెడ్డి, తోకల వెంకటేశ్వర్లు, గుత్తా గోపీ, మధు, చీమల శ్రీను, పారా జనార్దన్, జంపని నరసరాజు, కవులూరి మురార్జి, వసంత్, నరసయ్య, వెంకటరావు, చెరుకూరి రాజేంద్రప్రసాద్, మధు, చీమల శ్రీను, సాపల రవణయ్య, సాపల శ్రీనివాస్, కవర్తపు వాసు, దారం మాల్యాద్రి, దారం కృష్ణమనాయుడు, మసూద్, జిలాని, అనుమోలు లక్ష్మీ నరసింహాం, ఉన్నం వీరాస్వామి, పి.శ్రీను, మార్తాల వెంకటేశ్వర్లు, ప్రభా కూనం, వీరయ్య, కర్ల వెంకటరావు, చీమల రాజా, చీమకుర్తి కృష్ణారెడ్డి, యాళ్ల బ్రహ్మారెడ్డి, చుండి సూర్యం, చల్లా మురళీ, వరికూడి కృష్ణారెడ్డి, వీఆర్‌ కోట నాయుడు, మాజీ కౌన్సిలర్లు చింతలపూడి మోహన్‌రావు, షేక్‌ ఖాదర్‌బాషా, జాజుల కోటేశ్వరరావు, కరీమూన్, గౌష్‌బాషా, సాదు మాదవ తదితరులు దాదాపు 1,500 మంది పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త తూమాటి మాధవరావు, నాయకులు వరికూటి కొండారెడ్డి, కేవీ రమణారెడ్డి, వెన్నా హనుమారెడ్డి,  వై.వెంకటేశ్వరరావు, శేషారెడ్డి, దూళిపూడి ప్రసాద్‌నాయుడు, మిడసల వెంకట విశ్వేశ్వరరావు, గోపీనాథ్, వల్లెపు మురళి, గంటా రామానాయుడు, పులుగు అక్కిరెడ్డి, పటాపంజుల అశోక్, మోహన్‌రావు, కిరణ్, సింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పార్టీ బలోపేతానికి వ్యూహరచనలో బాలినేని..
జిల్లా వ్యాప్తంగా పలువురు నేతలు కాంగ్రెస్, టీడీపీల నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిలు పలువురు ఇతర పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మాజీ పీడీసీసీబీ చైర్మన్‌ ఈదర మోహన్‌ వైఎస్సార్‌ సీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సైతం వైఎస్సార్‌ సీపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

ఇటీవలే ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు వైవీ సుబ్బారెడ్డిని కలిసి సంప్రదింపులు జరిపారు. వీరితో పాటు జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి కొందరు ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు సైతం ఇతర పార్టీలో నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. ఇక గ్రామస్థాయిల్లో అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు నిత్యం వైఎస్సార్‌ సీపీలో చేరుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో వైఎస్సార్‌ సీపీని తిరుగులేని శక్తిగా నిలిపేందుకు ఆ పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసులురెడ్డి శరవేగంగా పావులు కదుపుతున్నారు. 

Advertisement
Advertisement