ఇదీ మోదీ చలవేనా..?

21 Nov, 2017 13:56 IST|Sakshi

సాక్షి,ముంబయి: మోదీ సర్కార్‌పై విమర్శల దాడితో విరుచుకుపడేందుకు భాగస్వామ్య పక్షం శివసేన ఏ అంశాన్నీ విడిచిపెట్టడం లేదు. తాజాగా మానుషి చిల్లార్‌ మిస్‌ వరల్డ్‌ కిరీటం దక్కించుకోవడాన్ని శివసేన మోదీని టార్గెట్‌ చేసేందుకు వినియోగించుకుంది.

మోదీ వల్లే మానుషి మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ను భారత్‌కు తీసుకువచ్చిందని బీజేపీ నేతలెవరూ ప్రకటించకపోవడం పట్ల శివసేన విస్మయం వ్యక్తం చేసింది. హర్యానా సుందరి మానుషి చిల్లార్‌ 17 సంవత్సరాల విరామం తర్వాత భారత్‌కు మిస్‌ వరల్డ్‌ కిరీటం తీసుకువచ్చిందని, ఇది మోదీ సర్కార్‌ ఘనతకు అద్దం పడుతుందని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో శివసేన వ్యంగ్యాస్ర్తాలు సంధించింది.

ప్రపంచ అందాల సుందరి కిరీటం భారత్‌కు దక్కడం మోదీ చలవేనంటూ ఇంతవరకూ బీజేపీ నేతలెవరూ ముందుకు రాకపోవడం విడ్డూరమేనని వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు