‘చంద్రబాబుకు ఆ అర్హత లేదు’

21 May, 2020 18:59 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, చిత్తూరు : ఇకపై ప్రజలు కరోన మహమ్మరితో సహజీవనం చేస్తూనే తగు జాగ్రత్తలతో దైనందిత జీవనం సాగించాలని తిరుపతి పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ అన్నారు. కరోనాకు భయపడి హైదరాబాద్‌లో దాకొన్న చంద్రబాబుకు పాలక ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గురువారం నాడు-నేడు పై కమిషనర్ గిరీషాతో కలసి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అధికారులతో సమీక్షించారు. (భానుడి ప్రతాపం: తీసుకోవలసిన జాగ్రత్తలు )

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను కేంద్రం సైతం కొనియాడుతున్నదని ఎంపీ చెప్పారు. ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం కరోనాకు భయపడి పక్క రాష్ట్రంలో దాక్కోని ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కరోనా వైరస్ కట్టడికి ఎంపీ నిధుల నుంచి తిరుపతికి 50 లక్షలు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేటకు 25 లక్షల చొప్పున ఇచ్చినట్లు తెలిపారు. నాడు నేడుపై చేపడుతున్న పనులు రాష్ట్ర చరిత్రలో నిలచి ఉంటాయని అన్నారు. (మూడేళ్ల తర్వాత.. కరోనా కలిపింది )

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు