రాహుల్‌ గాంధీ సినిమా.. శోభనం రాత్రి!! | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీ సినిమా.. శోభనం రాత్రి!!

Published Wed, Dec 20 2017 3:47 PM

Naresh Agrawal compares Rahul’s movie outing to suhaag raat - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నోరుజారడం అలవాటుగా చేసుకున్న రాజకీయ నేతల జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేశ్‌ అగర్వాల్‌ టాప్‌ లిస్ట్‌లో ఉంటారు. ఆయన చేసేది సద్విమర్శే అయినా ఉపయోగించే పదాలు విపరీత అర్థాలకు దారి తీస్తాయి. తాజాగా రాహుల్‌ గాంధీని సమర్థిస్తూ.. అదే సమయంలో బీజేపీని విమర్శిస్తూ అగర్వాల్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

నేతలు శోభనాన్ని వద్దనుకుంటారా? : ‘‘ఒక రాజకీయ నాయకుడి శోభనం రాత్రికి ముహుర్తం కుదురుతుంది.. సరిగ్గా అదే రోజు ఏ ఎన్నికల ఫలితాలో వెలువడ్డాయనుకోండి.. ఆ నేత ఫస్ట్‌నైట్‌ను రద్దు చేసుకుంటాడా? బీజేపీ సంకుచితంగా ఆలోచిస్తోంది. రాహుల్‌ గాంధీ వ్యక్తిగత విషయాలపై వారు మాట్లాడటం సిగ్గుచేటు’’ అని నరేశ్‌ అగర్వాల్‌ అన్నారు.

రాహుల్‌ గాంధీ సినిమా ఏంటంటే..! : గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం కాంగ్రెస్‌​ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఢిల్లీలోని ఓ మాల్‌లో ‘స్టార్‌ వార్స్‌’ సినిమా చూశారట! అంతే, బీజేపీ నేతలు తమ నోటికి పనిచెప్పారు. ‘‘పార్టీ ఓటమిభారంతో కుమిలిపోతుంటే, నాయకుడు(రాహుల్‌) మాత్రం సినిమా చూసి ఆనందించారు’’ అని వ్యాఖ్యలు చేశారు. కాగా, రాహుల్‌ వ్యక్తిగత జీవితంపై బీజేపీ నేతలు టార్గెట్‌ చేయడాన్ని ఎస్పీ నేత నరేశ్‌ అగర్వాల్‌ తప్పుపట్టారు. బీజేపీ ఒక సంకుచిత పార్టీ అని విమర్శించారు. కానీ రాహుల్‌ సినిమా వీక్షణను శోభనం రాత్రితో పోల్చి అభాసుపాలయ్యారు.

Advertisement
Advertisement