Sakshi News home page

నాడు అలా.. నేడు ఇలా..

Published Fri, Mar 15 2019 8:20 AM

No Ticket For Gangula Prathap Reddy in TDP - Sakshi

కర్నూలు(అర్బన్‌):  నాడు ప్రధానమంత్రి కోసం ఎంపీ పదవిని త్యాగం చేసిన గంగుల ప్రతాపరెడ్డి నేడు అదే స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు టికెట్‌ కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా 1,86,766 ఓట్ల మెజారిటీతో  గంగుల ప్రతాపరెడ్డి విజయం సాధించారు. అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహరావు కోసం తన పదవిని త్యాగం చేశారు. నాడు దేశంలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ నరసింహరావు దేశంలోని ఏదో ఒక లోక్‌సభ స్థానం నుంచి ఎన్నిక కావాల్సి వచ్చింది. ఈ సందర్భంలోనే పీవీ నంద్యాల నుంచి పోటీ చేసేందుకు వీలుగా గంగుల రాజీనామా చేశారు. 1991లోనే నంద్యాల స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పీవీ నరసింహరావు తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్‌పై విజయం సాధించారు.  అయితే నేడు అదే స్థానం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.   

Advertisement

What’s your opinion

Advertisement