ఎలాంటి బూతులు మాట్లాడలేదు | Sakshi
Sakshi News home page

ఎలాంటి బూతులు మాట్లాడలేదు

Published Sun, Apr 22 2018 5:50 PM

No Vulgar Language Speaks - Sakshi

గుంటూరు : ఏపీ సీఎం చేపట్టినదీక్షలో తాను ఎలాంటి  బూతుమాటలు వాడలేదని, అలా అనుకునేవారికి వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం 5 కోట్ల మంది ప్రజల ఆవేదనను ప్రధానిపై ఆగ్రహం వ్యక్తం చేసేలా తాను మాట్లాడానని చెప్పుకొచ్చారు. తాను మాట్లాడిన మాటలను మార్ఫింగ్ చేసి నన్ను అప్రదిష్ట పాలు చేయాలని చూశారని ఆయన అన్నారు.  జై సింహ వంద రోజుల ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు ఆదివారం చిలకలూరిపేటకు బాలకృష్ణ చేరుకున్నారు. ఈ సందర్భంగా బాబు దీక్షా శిబిరం వద్ద బాబు చేసిన వ్యాఖ్యల గురించి వివరణ ఇచ్చారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారికంగా నిర్వహించిన దీక్షా వేదికపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ   ‘ ఒక శిఖండిలాగా.. ఒక కొజ్జాలాగా సీట్లు గెలవచ్చనుకుంటున్నారు... టీ కప్పులో పడ్డ ఈగను కూడా చీకుతావా.. మఖ్కీ ఛూస్‌ .. జాగ్రత్త!.. ఇక దండోపాయమే. ఇది వార్నింగ్‌. ద్రోహి..నమ్మకద్రోహి. నిన్ను పరుగెత్తించి కొడతారు.
బంకర్‌లో దాక్కున్నా సరే భరతమాత నిన్ను క్షమించదు. సమాధి చేసేస్తుంది..’ అని దూషించడంతో పాటు ‘మీ ఇంట్లో వారిని గౌరవించడం చేతకాదు. మీ భార్యను గౌరవించడం చేతకాదు..’ అంటూ వ్యక్తిగత విమర్శలు సైతం చేయడంపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా మండిపడిన సంగతి తెల్సిందే.

ఈ విషయంపై బీజేపీ నేతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్యపై ఫిర్యాదు చేశారు.  హైదరాబాద్‌లోని బాలకృష్ణ నివాసాన్ని ముట్టడించి ఆయన కారును అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడంతో విషయం ఎక్కడో వెళ్తుందని భావించి బాలయ్య ఈ విషయం గురించి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చిలకలూరిపేటలో చెప్పారు.

Advertisement
Advertisement