పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

22 Apr, 2019 10:56 IST|Sakshi

సాక్షి, అమరావతి: ‘ఇది మనం ఎదిగే దశ. మార్పు చిన్నగానే మొదలవుతుంది. ఈ మార్పు ఎంత వరకు వెళ్తుందో తెలియదు. ఎన్నికలు పూర్తయిన వెంటనే వైఎస్సార్‌సీపీ, టీడీపీలు తమకు ఇన్ని స్థానాలు వస్తాయంటూ లెక్కలు వేయడం మొదలుపెట్టాయి. మనం అలా లెక్కలు వేయం. ఓటింగ్‌ సరళి ఎలా జరిగిందో తెలుసుకోమని మాత్రమే పార్టీ నాయకులకు చెబుతున్నా’ అని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ తరుఫున పోటీ చేసిన అభ్యర్థులతో పవన్‌ సమావేశమయ్యారు. ఈ భేటీకి 15 మంది మాత్రమే హాజరుకావడం గమనార్హం.

పోలింగ్‌ సందర్భంగా అభ్యర్థులకు ఎదురైన అనుభవాలను పవన్‌ అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సమావేశ వివరాలను పార్టీ కార్యాలయం మీడియాకు ఒక ప్రకటన రూపంలో విడుదల చేసింది. ఎన్నికలు లేని సమయంలో కూడా ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారం దిశగా పని చేయాలని పవన్‌ పార్టీ అభ్యర్థులతో చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే మార్పును ప్రజల్లోకి తీసుకువెళ్దామన్నారు. సమావేశంలో నాదెండ్ల మనోహర్, రాజకీయ సలహాదారు రామ్మోహనరావు, రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌ మాదాసు గంగాధరం, ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సమీక్ష

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా ఉండాలి

మోదీ ప్రధాని కావాలని గేదెలకు పూజ

లోక్‌సభ ఎన్నికలు : చివరి విడత ఎన్నికల అప్‌డేట్స్‌..

నన్ను తీర్చిదిద్దింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..

వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగిస్తుంది..

నిజాయితీపరులకే ఓటేయండి: నేగీ

కేదార్‌నాథ్‌లో మోదీ

చివరి ‘మన్‌కీ బాత్‌’ అనిపిస్తోంది!

బీజేపీ నన్ను చంపాలనుకుంటోంది

ఈసీలో అసమ్మతి ‘లావా’సా

నేడే చివరి విడత పోలింగ్‌

నేడైనా ఓటేయనిస్తారా?

కాంగ్రెస్‌లో టెన్షన్‌.. టెన్షన్‌!

ఆఖరి దశలో నువ్వా? నేనా?

స్విస్‌ బ్యాంక్‌లో రూ.7 కోట్ల డిపాజిట్లు..!

మోదీ–రాహుల్‌ ప్రచార మారథాన్‌

భం భం బోలే మెజార్టీ మోగాలే!

చంద్రబాబు స్కెచ్‌లో భాగమే లగడపాటి సర్వే

మోదీకి పరువు నష్టం నోటీసులు

‘చంద్రబాబుకు రానున్న రోజులు గడ్డుకాలమే’

చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యాలు

సరికొత్త నాటకానికి తెరలేపిన లగడపాటి