అడుగడుగునా వేదనలే.. | Sakshi
Sakshi News home page

అడుగడుగునా వేదనలే..

Published Sat, Mar 31 2018 2:20 AM

People says there troubles to YS Jagan at padayatra - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వేదనా భరితుల్ని ఓదారుస్తూ.. త్వరలో మంచి రోజులు వస్తాయని ధైర్యం చెబుతూ.. వివిధ వర్గాల వారి నుంచి వినతులు స్వీకరిస్తూ.. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 124వ రోజు శుక్రవారం ప్రజా సంకల్ప యాత్ర కొనసాగించారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గాన్ని దాటి తాడికొండ నియోజకవర్గంలో అడుగు పెట్టారు.

పెదకూరపాడు నియోజకవర్గ శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్రకు అశేష ప్రజానీకం నీరాజనం పలికింది. పాటిబండ్ల, ముస్సాపురం, పొడపాడు, సిరిపురం, సరిపూడిలో అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతూ సమస్యలు విన్నవించారు. మహిళలు, యువకులు, రైతు కూలీలు.. పాలక పార్టీ దౌర్జ న్యాలు, సంక్షేమ పథకాల్లో వివక్షతను జగన్‌ దృష్టికి తెచ్చారు. రేషన్‌కార్డు, పింఛన్‌.. ఏది కావాలన్నా.. జన్మభూమి కమిటీల ఆమోద ముద్ర ఉందా? అని అధికారులు ప్రశ్నిస్తున్నారని వాపోయారు. జన్మభూమి కమిటీల వద్దకు వెళితే ఏ పార్టీ అని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు లంచాలు ఇవ్వనిదే ఏపనీ జరగడం లేదని విన్నవించుకున్నారు. ప్రజలందరి దీవెనలు, దేవుడి ఆశీర్వాదంతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తామని జగన్‌ హామీనిచ్చారు.

Advertisement
Advertisement