అభిమానం తోడుగా.. | Sakshi
Sakshi News home page

అభిమానం తోడుగా..

Published Fri, Feb 2 2018 6:45 AM

 people support to jagan in praja sankalpa yatra - Sakshi

అడుగులు పెరుగుతున్న కొద్దీఅభిమానం రెట్టింపవుతోంది.కష్టాలు విని ధైర్యం చెప్పేజననేతకు ఎదురేగిస్వాగతం పలుకుతోంది.రాజన్న బిడ్డకుఆత్మీయతానురాగాలుపంచుతోంది.నవరత్నాలతో కొత్త కాంతులునిండుతాయని నమ్ముతోంది.పేదల సంక్షేమం నీతోనేఅంటూ నినదిస్తోంది.మోసగారి పాలనను సాగనంపుతామంటోంది.మేమున్నామంటూ సంకల్పయాత్రికుడి అడుగులోఅడుగేస్తోంది. రాజన్న రాజ్యం దిశగాముందుకు కదులుతోంది.

సాక్షిప్రతినిధి, నెల్లూరు: జనాభిమానం వెల్లివిరిసింది. దారులన్నీ జనసంద్రంగా మారాయి. జననేతను కలసి ఆత్మీయంగా మాట్లాడాలని కొందరు.. ఆయనతో ఫొటో, సెల్ఫీ దిగాలని మరొకొందరు.. కష్టాలు చెప్పుకుని బాసట పొందాలని ఇంకొందరు వెల్లువలా తరలివచ్చారు. ఇలా అశేష జనవాహిని వెంట రాగా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 77వ రోజు కొనసాగింది. గురువారం సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలోని పొదలకూరులో ప్రారంభమైన యాత్ర మరుపూరులో ముగిసింది. మొత్తం 7.5 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర కొనసాగించారు. ఈనెల మూడో తేదీన సర్వేపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర ముగిసి నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.

యాత్ర సాగిందిలా..
ఉదయం 8గంటలకు పొదలకూరులోని బాబా లేఔట్‌ నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. రాత్రి బసచేసిన శిబిరం వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. జైజై జగన్‌ నినాదాల నడుమ జననేత 77వ రోజు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ పదేళ్ల చిన్నారి యోగ్యత జననేతను కలిసింది. వైఎస్‌ఆర్‌ కుటుంబ చిత్రపటాన్ని జగనన్నకు బహూకరించింది. అక్కడ నుంచి తోడేరు క్రాçస్‌ రోడ్డుకు చేరుకున్న జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా అక్కడ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తండ్రి, మాజీ సమితి అధ్యక్షుడు కాకాణి రమణారెడ్డి జననేతను కలిసి ఆత్మీయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్‌ రమణారెడ్డి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రమణారెడ్డి జననేతను సత్కరించారు. అక్కడ నుంచి చాట్లగుట్ట చేరుకన్న జగన్‌కు గ్రామస్తులు స్వాగతం పలికారు. అక్కడ అంకమ్మ అనే వృద్ధురాలు తన మనుమడు మదన్‌ను తీసుకుని జననేతను కలిశారు.

లుకేమియా వ్యాధితో మదన్‌ బాధపడుతున్నాడనీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేసింది. అనంతరం చాటగొట్ల ప్రధాన సెంటర్‌లో జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరిన ప్రతిపక్ష నేతను మార్గం మధ్యలో వడ్డెర సంక్షేమ సంఘం సభ్యులు గుంజి మాధవి, రామతులసి, అరుణతో పాటు పలువురు మహిళలు కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. తమకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. అక్కడే నెల్లూరు కేన్సర్‌ హాస్పిటల్‌ సాధన సమితి నేత జి.శ్రీనివాసులు నేతృత్వంలో పలువురు జననేతను కలిసి వినతిపత్రం సమర్పించారు.

విక్రమసింహపురి వర్సిటీలో స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామని గతంలో భూములు తీసుకున్నారని, అయితే స్థానికులు ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదన్నా అంటూ స్థానిక మహిళలు సంపత్తు లక్ష్మి, సులోచనమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అక్కడ నుంచి మరుపూరు చేరుకున్న జగన్‌కు ప్రజలనుంచి సాదరస్వాగతం లభించింది. మరుపూరు గిరిజన కాలనీలో మహిళలు తమకు కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తంచేశారు. తెలుగుదేశం పార్టీ నేత బత్తుల శేషారెడ్డి తన అనుచరులతో జగన్‌మోహ సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. వారికి జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అక్కడ వైఎస్‌ఆర్‌సీపీ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌ నేతలు జననేత వెంట నడచి ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఈసందర్భంగా ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు.

పాల్గొన్న నేతలు వీరే..
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధ్దనరెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్‌ పి.అనిల్‌ కుమార్‌ యాదవ్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి, పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ నేత పేర్నాటి శ్యాంప్రసాద్‌ రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పి.రూప్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement