కన్నీళ్లు తుడుస్తూ.. | Sakshi
Sakshi News home page

కన్నీళ్లు తుడుస్తూ..

Published Tue, Feb 13 2018 7:07 AM

people support to ys jagan in praja sankalpa yatra  - Sakshi

బాబు వస్తేనే జాబు వస్తాదనే మాటలు నమ్మిమోసపోయిన యువత..రుణాల మాఫీ హామీలు విశ్వసించిదగాపడ్డ అన్నదాతలు, అక్కచెల్లెమ్మలు.ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందకఉన్నత చదువులకు దూరమైన విద్యార్థులు..పింఛను అందక కన్నీటి పర్యంతమవుతున్నఅవ్వాతాతలు.. దివ్యాంగులు.. వితంతువులు..ఆపదలో మెరుగైన వైద్యం కరువైన అభాగ్యులు....వంచనకు గురైన అన్ని వర్గాల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.తమ కష్టాలు తెలుసుకునేందుకు వస్తున్న జననేతకుప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారుఆయన అడుగులో అడుగేస్తున్నారు..బాధాతప్త హృదయాల కన్నీళ్లు తుడుస్తూ..నేనున్నానని భరోసా ఇస్తూ..ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ ముందుకు సాగుతున్నారు.

సాక్షిప్రతినిధి, నెల్లూరు: ఎటుచూసినా సమస్యల సుడిగుండాలే. గిట్టుబాటు ధరలేక అన్నదాత.. చేసిన కష్టానికి సరైన ఫలం అందలేదని కూలీలు.. ఏడుపదుల వయస్సు దాటినా పింఛను అందడం లేదని వృద్ధులు.. ఇలా అందరూ సమస్యల చట్రంలో కొట్టుమిట్టాడుతూ జననేత ఎదుట గోడు వెళ్లబోసుకుంటున్నారు. అందరి కష్టాలను వింటూ.. వారి కన్నీళ్లను తుడుస్తూ.. అధైర్యపడొద్దు.. అండగా ఉంటానని భరోసా ఇస్తూ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్నారు. పల్లె ప్రజల నీరాజనాల నడుమ 85వ రోజు ప్రజాసంకల్పయాత్ర ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో సా గింది. అనంతపురం గ్రామంలో ప్రారంభమైన యాత్ర పెద్దకొండూరులో ముగిసింది. సోమవారం జననేత 14.1 కి.మీ పాదయాత్ర కొనసాగించారు. మంగళవారం కలి గిరిలో బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

యాత్ర సాగిందిలా..
సోమవారం ఉదయం అనంతపురం గ్రామంలో ప్రజాసంకల్పయాత్ర  ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి జననేత కరచాలనం కోసం పోటీపడ్డారు. ఈ సందర్భంగా అక్కడ గొర్రెల పెంపకందారులు సూరిబోయిన కృష్ణయ్యతో పాటు పలువురు జగన్‌మోహన్‌రెడ్డిని కలసి తమ కష్టాలను పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ నుంచి లక్ష్మీపురం కం డ్రిగ చేరుకన్న జగన్‌కు మహిళలు ఘనస్వాగతం పలికారు. అక్కడ పొగాకు వలస కార్మికులు మండా రాజారావు, కాశమ్మ, రమేష్‌ జననేతను కలిశారు. తాము గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని రొంపిచర్ల నుంచి ఇక్కడకు వచ్చామని వర్షాభావంతో పంటలు లేక ఈ సీజన్‌లో పొగాకు కార్మికులుగా పనిచేస్తున్నామని చెప్పారు. పొగాకు బ్యారెన్‌లో పనిచేయ డం వల్ల తమ ఆరోగ్యం పాడవుతోందని తమ కు కూడా 45 ఏళ్లకే పింఛను సౌకర్యం కల్పిం చాలని కోరారు. అక్కడ నుంచి సిద్ధనకొండూరుకు చేరుకున్న జననేతకు ప్రజలు స్వాగతం పలికారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీపడింది. పసుపులేటి రమణమ్మ జగన్‌ను కలిసి తాను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నానని కనీసం తనకు పింఛను కూడా లేదయ్యా అంటూ ఆవేదన వ్యక్తంచేసింది.ఆయుష్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేవీ హనుమంతరెడ్డితో పాటు మరికొందరు జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వ డం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

అనంతరం లక్ష్మీపురం చేరుకున్న జగన్‌ను లక్ష్మీపురం పంచాయతీలోని కందుల వారి పాళెం ఎస్టీ కాలనీ ప్రజలు కలసి తమ కాలనీలో ఫ్లోరైడ్‌ ప్రభావం అధికంగా ఉందని కాలనీని వేరేచోటికు మార్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఎస్సీ కాలనీ ప్రజలు కలసి కాలనీకి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. జ్యోతిక మాట్లాడుతూ తమకు ఇళ్లు కాని, ఇంటి పట్టాలు కానీ లేవని, గ్రామంలో ఈ సమస్య అధికంగా ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. అనూష అనే గృహిణి కలి సి తన కుమారుడు ఆశిష్‌నందన్‌కు వెన్నుముక సమస్య తీవ్రమై కిడ్నీ వ్యాధి తో బాధపడుతున్నాడని కన్నీటి పర్యం తమైంది. నాయిబ్రాహ్మణ సంఘం నాయకులు అనిల్‌కుమార్‌ కలసి తమ ను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరు తూ వినతిపత్రం ఇచ్చారు. అనంతరం పరికో ట చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి రామస్వామిపాళెం చేరుకున్న జననేతను వేములపాడుకు చెందిన చేవూరు రమణమ్మ జగన్‌తో మాట్లాడుతూ 12వేలు పొదుపుసంఘంలో రుణం తీసుకుని సగంపైగా చెల్లించా మని, దానిని వడ్డీ కింద చెల్లించుకుని మొత్తం చెల్లించకుంటే ఇంటికి తాళంవేస్తామని బ్యాంకర్లు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసింది. రైతులు కృష్ణారెడ్డి, రామి రెడ్డితో పాటు మరికొందరు కలిసి గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రమాద బీమాతో పాటు హెల్త్‌కార్డులు ఇప్పిం చాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

దాసరి దొరబాబు కలిసి తాను పదేళ్ల కిందట అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌గా రూ 8లక్షలు డిపాజిట్లు కట్టించానని ఇప్పు డు బాధితులు తనపై తీవ్ర ఒత్తిడి తెస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. 14వ మైలు చేరుకున్న వైఎస్‌ జగ న్‌కు ప్రజలు అపూర్వస్వాగతం పలికారు.  సీహెచ్‌ శ్రీనివాసులనే దివ్యాంగుడు జగన్‌ను కలిసి తనగోడు వెళ్లబోసుకున్నాడు. అనంతరం అయ్యప్పరెడ్డిపాళెం చేరుకున్న జననేతకు ప్రజలు స్వాగతం పలి కారు. అక్కడ వేల్పుల రామతులశమ్మ జగన్‌ను కలిసి గత 20ఏళ్లుగా నాలుగున్నర ఎకరాల భూమిని సాగుచేసుకుం టున్నా ఇంతవరకూ పట్టాలు ఇవ్వలేదని ప్రతి జన్మభూమి సభలో అర్జీపెట్టుకు న్నా అధికారులు పట్టించుకోవడం లేద ని విన్నవించింది. అక్కడ నుంచి పెద్దకొండూరు ఎస్సీ కాలనీకి చేరుకున్న జగన్‌ను పాపమ్మ అనే మహిళ కలిసింది. గ్రామంలో బెల్టుషాపులను తీసివేయించాలని కోరింది.

ముఖ్యనేతలు హాజరు
పార్లమెంట్‌ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థనరెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్‌ పి.అనిల్‌ కుమార్‌ యాదవ్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి,  పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్, వైఎస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజాసంకల్పయాత్ర కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు ధర్మాన ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి, పార్టీ నేతలు పేర్నాటి శ్యాం ప్రసాద్‌ రెడ్డి,  జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పి.రూప్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement