జనం మాట.. జగన్‌ బాట | Sakshi
Sakshi News home page

జనం మాట.. జగన్‌ బాట

Published Thu, Mar 8 2018 7:14 AM

People Support To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

ప్రజా సంకల్ప యాత్రలో జనాభిమానంపోటెత్తుతోందిపేదవాడి సంక్షేమం, భావితరాల బాగుకోసం..కఠోరదీక్షకు నడుం బిగించిన అలుపెరుగని బాటసారిచేతి స్పర్శ కోసం పల్లెలన్నీ కదలివస్తున్నాయి.నాలుగేళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకుంటూ..సంక్షేమ రాజ్యం తెస్తానని వివరిస్తూ.. బాధితులకు భరోసా కల్పిస్తూ..పేదవాడి ముఖంలో ఆనందం చూడాలంటూ..జనం గుండెచప్పుడైముందుకు సాగుతున్న జననేతకు జనం జేజేలు పలుకుతున్నారు.నవరత్నాలతో సంక్షేమం వెల్లివిరుస్తుందని బలంగా విశ్వసిసున్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రకు ప్రజాభిమానం వెల్లువెత్తుతోంది. జగన్‌ యాత్రకు జనం తండోప తండాలుగా తరలి వస్తున్నారు. వైఎస్‌.జగన్‌తో కలిసి అడుగులో అడుగు వేసి ఆయనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ప్రజాసమస్యలను ఏకరువు పెడుతున్నారు. అన్నీ విన్న జగన్‌ తానున్నానంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. బుధవారం యాత్ర పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు నుంచి ప్రారంభమై హనుమాజీపాలెం, జరుబులవారిపాలెం, కొడవలివారిపాలెం, కేశవరప్పాడు, రంగప్పనాయుడుపాలెం క్రాస్‌ రోడ్డు, నందిగుంటపాలెం మీదుగా సాయంత్రానికి యాత్ర సంతరావూరు వరకు కొనసాగింది. అడుగడుగునా జనం జగన్‌కు ఘనస్వాగతం పలికారు. కేశవరప్పాడు వద్ద వైఎస్‌ జగన్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. రైతులు, మహిళలు, ప్రజాప్రతినిధులు, యువతతో పాటు అన్ని వర్గాల వారు జగన్‌ను కలిసి సమస్యలు ఏకరువు పెట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కృష్ణా నీటిని పర్చూరుకు తీసుకువస్తే ప్రకాశం జిల్లాలోని 50 గ్రామాలు తాగు, సాగునీరు అందుతుందని రైతులు తెలిపారు. ప్రాజెక్టు సర్వే కోసం దివంగత నేత వైఎస్‌ ఉన్నప్పుడు రూ.75 లక్షలు మంజూరు చేశారని రైతులు జగన్‌కు తెలిపారు.

ఆ తర్వాత ఎవ్వరూ దీనిని పట్టించుకోలేదన్నారు. కేశవరప్పాడులో మహిళలు జగన్‌కు ఘనస్వాగతం పలికారు. ఇక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మిర్చి రైతులు జగన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. సక్రమంగా నీరు అందక అరకొర పంటలు పండాయని,  పండిన పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. మిర్చి క్వింటా రూ.10 వేలు, శనగకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రైతులు కోరారు. బర్లీ పొగాకు రైతులు జగన్‌ను కలిసి బాధలు చెప్పుకున్నారు. వరుస కరువులతో దిగుబడి పడిపోయిందని ధరలు కూడా పతనమయ్యాయని వాపోయారు. క్వింటా పొగాకుకు రూ.7 వేలు మద్దతు ధర ఇస్తే గానీ గిట్టుబాటు కాదని, ఇప్పుడు సగం ధర కూడా రావడం లేదని రైతులు జగన్‌కు తెలిపారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమకు న్యాయం చేయాలని కోరారు. పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని హనుమాజీపాలెంకు చెందిన రైతులు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వద్ద మొర పెట్టుకున్నారు. రెండు నెలల బాబుకు పేగు ఆపరేషన్‌కు లక్ష రూపాయలు ఖర్చు కాగా, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదని వెంకటేశ్వరరావు, జార్జి దంపతులు, 108 ఉద్యోగులు తమ సమస్యలపై జగన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లా స్థిరమైన వేతనాలు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.  బుధవారం వైఎస్‌ జగన్‌ 15.3 కి.మీ. నడిచారు.

జననేతకు సమస్యల ఏకరువు
టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 108 వాహనం సక్రమంగా రావడం లేదు. ఇటీవల మా భార్యకు డెలివిరి నొప్పులు వస్తే 108 వాహనానికి ఫోన్‌ చేశాం. ఎంత సేపటికీ వాహనం రాకపోవడంతో ఆటోలో వెళ్లాల్సి వచ్చింది. అదే ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏంటని కొడవలివారిపాలేనికి చెందిన బత్తుల సాంసన్‌ ఆవేదన చెందారు.
నాలుగేళ్లుగా గ్రామంలో ఉపాధి పనులు లేవు. టీడీపీ నాయకులు, అధికారులు కుమ్మక్కై వారి వర్గానికే పనులు పెట్టుకుంటున్నారు. కొన్ని యంత్రాలతో పనులు చేయించుకొని బిల్లులు చేసుకుంటున్నారు. దీని వల్ల పేదలకు ఉపాధి లేకుండా పోయింది. గ్రామంలో ఉన్న అందరికీ ఉపాధి పనులు చూపించాల్సిన అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని కొడవలివారిపాలేనికి చెందిన యారం సురేష్‌ తెలిపారు. మా గ్రామానికి పాదయాత్రగా వస్తున్న జగన్‌కు ఈ విషయంపై విన్నవించాలని వచ్చామన్నారు.
హనుమోజీపాలెం అంబేడ్కర్‌ నగర్‌లో 400ల కుటుంబాలు ఉన్నాయి. సైడు కాలువలు లేవు. రోడ్లు సక్రమంగా లేవు. దీంతో వర్షం పడితే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. కనీసం ఇళ్లల్లో వాడుకున్న మురుగు నీరు కూడా బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఎన్ని సార్లు అధికారులకు, నాయకులకు అర్జీలు పెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. మేమంతా వైఎస్సార్‌ సీపీ అని వివక్ష చూపుతున్నారు. మా సమస్య జగన్‌ వస్తేనన్నా తీరుతుంది. పాదయాత్రగా జగన్‌ మా గ్రామానికి వస్తున్నాడు. సమస్యను ఆయనకు చెప్తామని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన మహిళలు చెప్పారు.
108 ఉద్యోగులకు ఐదు నెలల నుంచి బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని వాహనాల మరమ్మతులు చేయించటం లేదని ఇంకొల్లుకు చెందిన 108 ఉద్యోగులు దేవరాజు, వాసులు వైఎస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
పీహెచ్‌సీల్లో రెండో  ఏఎన్‌ఎంలుగా పని చేస్తున్న వారికి కనీస వేతనమివ్వకపోవడం, ప్రసూతి సెలవులివ్వకుండా ఇబ్బందులు పడుతున్నామని మణి, మరో ముగ్గురు వైఎస్‌ జగన్‌ను కలిసి విన్నవించారు.

వైఎస్‌.జగన్‌తో కలిసి నడిచిన నేతలు:
18వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు మోపిదేవి వెంకట రమణ, బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్, పర్చూరు సమన్వయకర్త రావి రామనాథంబాబు, పార్టీ నేతలు గొట్టిపాటి భరత్, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కుప్పం ప్రసాద్, వెంకట్రావు, మైనార్టీ సెల్‌ అధ్యక్షులు జలీల్, సుభాన్, ఒంగోలు నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement