కొంగొత్త ఉషస్సు | Sakshi
Sakshi News home page

కొంగొత్త ఉషస్సు

Published Fri, May 4 2018 7:48 AM

People Support To Ys Jagan In Praja sankalpa yatra - Sakshi

నవోదయానికి నాందిలాకొత్త పొద్దు పొడుపులాకొంగొత్త ఉషస్సులాఎగసిపడే కెరటాల్లామేము సైతం అంటూజననేత వెంట నవతరం...ప్రజాసంకల్పయాత్రలోపరవళ్లుతొక్కుతోంది..

సాక్షి, అమరావతిబ్యూరో: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే సత్తా వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే ఉందని యువత ప్రజా సంకల్పయాత్ర ద్వారా సృష్టం చేసింది. ఆ విశ్వాసంతోనే యువతీ యువకులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రత్యే క హోదా వస్తే  పరిశ్రమలు వచ్చి , ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గురువారం 152 రోజు  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మచిలీపట్నంలో  తాను బస చేసిన శిబిరం నుంచి  ఉదయం 7.40 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు.  కొత్తపూడి క్రాస్, బుద్దాలపాలెం వరకు పాదయాత్ర చేశారు. స్థానిక ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలు వింటూ నేనున్నానంటూ భరోసా కల్పించారు. పెద్ద ఎత్తున విద్యార్థులు, యువతీ యువకులు తరలివచ్చి  తమ ఉజ్వల భవిష్యత్తుకు అలుపెరుగని పోరాటం చేస్తున్న  జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి  సంఘీభావంగా అడుగులో అడుగులు కలిపారు.

చంద్రబాబువి కల్లబొల్లి మాటలు....
 కాంట్రాక్టు ఉద్యోగులతో  గొడ్డు చాకిరీ చేయించుకొని ప్రభుత్వం కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వటం లేదని సునీత, దేవి ప్రసన్న, పావని, వెంకటేశ్వర్లు జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆవేదన వెల్లబుచ్చారు. హైటెక్‌ యుగమని చెప్పుకుంటున్న  ప్రభుత్వంలో నేటికి పల్లెలకు బస్సుసౌకర్యం కూడా కల్పించలేకపోవడంతో అధిక చార్జీలు వెచ్చించి ప్రైవేటు వాహనాలు ఆశ్రయిస్తున్నామని బుద్దాలపాలెంకు చెందిన భూలక్ష్మీ, శివపార్వతి, హరిత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తమ బాధలు వివరించారు. ప్రతి ఇంటికీ పెద్దకొడుకునవుతా నంటూ కల్లబొల్లి మాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు  తమకు 80 ఏళ్లు వయస్సు వచ్చినా వృద్ధాప్య పింఛన్లు ఇవ్వటం లేదని  బుద్దాలపాలెంకు చెందిన లక్ష్మీ, తులసమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టుకతోనే అంగవైకల్యం వచ్చి నడవలేని దుస్థితిలో ఉన్న తన బిడ్డకు ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం అందించలేమని వైద్యులు చెబుతున్నారని, తన బిడ్డను ఆదుకోవాలని కుమ్మరిపాడుకు చెందిన అంజలీదేవి కన్నీటిపర్యంతమయ్యారు.

సిమెంట్‌ రోడ్డుపై పడి నడుము ఇరిగిపోయి మంచానికే పరిమితమైన తనను ఆదుకోవాలని కొత్తపూడికి చెందిన రోజా పుష్పం జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు.

పెట్టుబడులు మట్టిపాలు...
 ఈ ఏడాది సీజన్‌ లో వర్షాలు లేవు...బోర్లు, బావులు, చెరువులు ఎండిపోయాయి... పంటలు వేస్తే సాగునీరు లేక దెబ్బతిన్నాయి. పెట్టిన పెట్టుబడులు మట్టిపాలయ్యాయని పలువురు రైతులు జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు లేక బిందెడు నీరు కోసం కష్టాలు పడుతున్నామంటూ  పొట్లపాలెం, చిన్న కొత్త పూడికి చెందిన నాగేశ్వరమ్మ, గంగభవాని, స్వాతి, రాణి జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు పండక అప్పుల పాలయ్యామంటూ వాపోయారు. రైతులు ఆర్థికంగా చితికి పోయి పిల్లల చదువులకు కూడా ఇబ్బందిపడుతున్నామని చెప్పారు. వివాహాలు సైతం చేయలేని పరిస్థితి ఉందని చిన్న కొత్త పూడికి చెందిన పుష్ప, మరియమ్మ, సుందరమ్మ తమ  ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడు, మీ అందరి దయవల్ల మనందరి ప్రభుత్వం అ«ధికారంలోకి వస్తే  మీ కష్టాలు అన్ని తీరుస్తానని, రాజన్న పాలన వస్తుందని జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించారు.

పాదయాత్రలో పాల్గొన్న పార్టీ నేతలు
వైఎస్సార్‌ సీపీ నేత జోగి రమేష్, పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్, వైఎఎస్సార్‌ సీపీ రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి తదితరులున్నారు. 

Advertisement
Advertisement