సింగపూర్ పర్యటన వెనుక రాజకీయ కుట్ర | Sakshi
Sakshi News home page

సింగపూర్ పర్యటన వెనుక రాజకీయ కుట్ర

Published Fri, Apr 13 2018 2:03 PM

Political Conspiracy Behind Singapore Tour - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సింగపూర్ పర్యటన వెనుక రాజకీయ కుట్ర ఉందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిథి అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ..తెలుగు ప్రజలు ఏకతాటిపై లేరని మోదీకి తెలియచేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. సింగపూర్‌కు వెళ్లి కేంద్రంతో లాలూచీ పడుతున్నారా.. లేక కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయని వివరించారు.  ఈ నెల 16న బంద్ విఫలం చేయడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలు ఇచ్చిన బంద్‌ని చంద్రబాబు అపహాస్యం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఉద్యమం జరుగుతుంటే చంద్రబాబు సింగపూర్ వెళ్లారని గుర్తుచేశారు. గతంలో సింగపూర్, దావోస్ ఇలా అన్నిదేశాలు వెళ్లి ఏం పెట్టుబడులు సాధించారని ప్రశ్నించారు. చంద్రబాబుకి హోదా సాధించాలని చిత్తశుద్ధి ఉంటే బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.

‘ ఢిల్లీలో చంద్రబాబు ఎందుకు ధర్నాలు చేయలేదు. బంద్‌లు, ధర్నాలు చేయకూడదని చంద్రబాబు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు ? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకి ధర్నాలు, బంద్‌లు కావాలి. బ్రిటీష్ వారిలాగా పాలన చేస్తున్న బీజేపీతో నాలుగేళ్లుగా ఎందుకు కలిసి వున్నారు. చంద్రబాబు బీజేపీతో కలిసి నాలుగేళ్లుగా ఏమి సాదించారు. బంద్‌లు, ధర్నాలు చేయకుండా ఎలా పోరాటం చేయాలి. టీడీపీ ఎంపీలను ఢిల్లీకి పంపిస్తే సబ్సిడీ భోజనం చేసి బయటకు వచ్చి విచిత్ర వేషాలు వేస్తున్నారు. టీడీపీ ఎంపీల కు చిత్తశుద్ధి ఉంటే ఎంపీ పదవులకు రాజీనామా చేయాలి. విచిత్ర వేషధారణతో పార్లమెంట్ ముందు వంగడాలు పోరాటమా’  అని తీవ్రంగా విమర్శించారు.

‘ పవన్ కళ్యాణ్ మాకు చిత్త శుద్ధి లేదు అంటే అది తప్పు.  ప్రత్యేక హోదా పై మాకు చిత్త శుద్ధి లేదు అంటే ఎవరికీ చిత్త శుద్ధి లేనట్లే. మా చిత్త శుద్దిని శంకిచడం అన్యాయం, పాపం. ఆనందనగరి అమరావతి కాదు. చంద్ర బాబు కుటుంబానికి ఆనందంగా కమీషన్లు దండుకోవడానికి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. జేసీ దివాకర్ రెడ్డి ఓ సీనియర్ లీడర్. కానీ టిడీపిలోకి చేరాకా బఫూన్ లాగా చేష్టలు చేస్తున్నారు. డిల్లీలో ఆయన చేసిన బఫూన్ కార్యక్రమాలు జనం గమనిస్తున్నారు’  అని వ్యాఖ్యానించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement