‘సంకల్ప’ సిద్ధిరస్తు!! | Sakshi
Sakshi News home page

‘సంకల్ప’ సిద్ధిరస్తు!!

Published Sat, Apr 14 2018 8:14 AM

Praja Sankalpa Yatra Starts In Krishna District Today - Sakshi

జననేతకు స్వాగతంపలికేందుకు కృష్ణాతీరంముస్తాబైంది. పేదలపెన్నిధికి ప్రేమతో ఆహ్వానంపలికేందుకు నగరం ఎదురుచూస్తోంది. అన్న పలకరింపుకోసం యువతరం ఉర్రూతలూగుతోంది. జగనన్నకరచాలనం కోసం అభిమానజనం క్యూ కడుతోంది. రాజన్నకొడుకును కనులారా చూద్దామని మహిళా లోకం ఏర్పాట్లుచేసుకొంటోంది.   సంకల్పసిద్ధిరస్తు అని ఆశీస్సులు అందించేందుకు పండిత సమూహంసిద్ధమైంది. నేడు కృష్ణాజిల్లాలోకిరానున్న వైఎస్‌ జగన్‌మోహన్‌  రెడ్డికి ఘన స్వాగతంపలికేందుకు అభిమాన లోకంసర్వం సిద్ధం చేసింది.  

సాక్షి,అమరావతిబ్యూరో: వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర శని వారం ఉదయం జిల్లాలోకి ప్రవేశించనుందని పార్టీ ప్రోగ్రా మ్స్‌ కమిటీ కోఆర్డినేటర్‌ తలసిల రఘురాం తెలిపారు. ఉదయం 7.30  గంటలకు యాత్ర గుంటూరుజిల్లా మంగళగిరి మండలం తాడేపల్లి నుంచి  ప్రారంభమై ఉదయం 8 గంటలకు విజయవాడలోని కనదుర్గ వారధి వద్ద ప్రవేశించనుంది. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌కు «ఘన స్వాగతం పలికేందుకు జిల్లా పార్టీ పరిశీలకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు రాష్ట్ర పార్టీ అధికారప్రతినిధి కొలుసు పార్థసారథి, విజయవాడ నగరంలోని నేతలు తలశిల రఘురాం, వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, వంగవీటి రాధ, బొప్పన భవకుమార్, పైలా సోమినాయుడుతో పాటు జిల్లాలోని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, కార్యకర్తలు, అభిమానులు సర్వం సిద్ధం చేశారు. పాదయాత్ర జరిగే ప్రదేశాలలో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజా సంకల్ప యాత్ర జిల్లాలో 13 నియోజకవర్గాల పరిధిలో సుమారు 275 కిలో మీటర్ల మేర సాగనుంది.

భరోసా కల్పించేలా..
గత ఎన్నికల సమయంలో వందలాది హామిలిచ్చి  ఏ ఒక్కటీ నెరవేర్చక చంద్రబాబు సర్కార్‌ ప్రజలను వంచించింది. రైతు రుణమాఫి, డ్వాక్రా రుణమాఫి, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, అంటూ రకరకాల హామీలిచ్చి అన్ని వర్గాలను మభ్యపెట్టింది. ఓట్లేయించుకొని గద్దెనెక్కి హామీలను తుంగలో తొక్కారు. బాబు వంచనతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, వృద్ధులు, చేనేతలు, కార్మికులు, అన్నిరకాల వారు దగా పడ్డారు. చంద్రబాబు సర్కార్‌ వంచనను ఎండగట్టడమే కాక దగా పడిన భాదితులందరికీ తానున్నానంటూ భరోసా కల్పిస్తూ వైఎస్‌ జగన్‌ యాత్ర సాగుతోంది. ఈ యాత్ర శని వారం కృష్ణా జిల్లాలోకి అడుగుపెడుతోంది. జగన్‌కు తమ బాధలు, కష్టాలు, కన్నీళ్లు, చెప్పుకొనేందుకు అన్ని వర్గాల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

జిల్లాలో అధికార పార్టీనేతలు చేస్తున్న అవినీతి అక్రమాలు, దందాలను జననేత ఎండగడతాడోనని అధికాçర పార్టీనేతల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇసుక, మట్టి మాఫియాను జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రోత్సహిస్తూ  వసూళ్లు చేసుకుంటున్న వైనంతో పాటు అవినీతిలో కూరుకుపోయిన నగర పాలక  సంస్థ పాలక పర్గంపై విరుచుకుపడే అవకాశం ఉందని పాలక వర్గం ఆందోళన చెందుతుంది.

నేడు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి చేరిక..
విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి శనివారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఆయన వేలాది మంది అనుచరులు భారీ ర్యాలీతో కనకదుర్గ వారధి వద్ద వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు.  ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటం, సంకల్పం చూసి పార్టీలో చేరనున్నట్లు రవి ప్రకటించారు.

కార్యకర్తల్లో ఉత్సాహం
జిల్లాలో ప్రవేశించనున్న ప్రజా సంకల్ప యాత్రకు స్వాగతం పలికేందుకు నాయకులు ఏర్పాట్లు చేçస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ప్రభుత్వ పెద్దల వైఖరిని తూర్పారపట్టేందుకు జగనన్న వస్తున్నాడని నాయకులు చెబుతున్నారు. పాదయాత్రంలో టీడీపీ నుంచి మరిన్ని చేరికలు ఉండే అవకాశముండడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం  నెలకొంది. పాదయాత్ర జరిగే ప్రతి నియోజవర్గంలో తమ అభిమాన నేతకు ఘన స్వాగతాలు పలికేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. 13 నియోజక వర్గాల్లో బహిరంగ సభలు ఉండడంతో టీడీపీ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టి, అన్ని వర్గాల ప్రజలకు నవరత్నాల లాంటి పథకాలతో భరోసా కల్పిస్తారని ఆయా వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.

తొలిరోజు ప్రజాసంకల్పయాత్ర ఇలా..
తొలిరోజు 8 గంటలలోపే గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి కనకదుర్గ వారధి నుంచి జిల్లాలోకి ప్రవేశించనుంది. అక్కడనుంచి  విజయవాడ తూర్పు, సెంట్రల్, వెస్ట్‌ నియోజకవర్గాల  పరిధిలోని  ఫ్లైఓవర్‌బ్రిడ్జి, వెటర్నరీ హాస్పటల్‌ సెంటర్, శిఖామణి సెంటర్, పుష్పా హోటల్‌ సెంటర్, సీతారాంపురం సెంటర్, కొత్త వంతెన సెంటర్‌వరకు సాగుతుంది. ఆపై భోజన విరామం అనంతరం బీఆర్టీఎస్‌ రోడ్డు,   మీసాల రాజారావు వంతెన,  ఎర్రకట్ట,  చిట్టినగర్‌ సెంటర్, చనుమోలు వెంకట్రావ ఫ్లైఓవర్‌ వద్ద పాదయాత్ర ముగియనుంది. చిట్టినగర్‌లో బహిరంగ సభ జరుగుతుంది. రాత్రికి వైవీరావ్‌ ఎస్టేట్‌లో బస చేస్తారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురామ్‌ తెలిపారు.
ప్రజా సంకల్పయాత్ర పోస్టర్‌ విడుదల
విజయవాడ సిటీ: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర శనివారం విజయవాడ నగరంలో ప్రవేశిస్తున్న నేపధ్యంలో పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ విజయచందర్‌ పాదయాత్ర  పోస్టర్‌ను విడుదల చేశారు. విజయవాడ వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విజయచందర్‌ మాట్లాడుతూ, ఇప్పటివరకు ప్రజా సంకల్పయాత్ర జరిగిన అన్ని జిల్లాల్లో విశేష ఆదరణ లభించిందన్నారు. కృష్ణా జిల్లాలో కూడా పూర్తిస్థాయిలో విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు అబద్దాల పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఆయన పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రచార కమిటీ రాష్ట్ర కార్యదర్శి జొన్నల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్నానని ప్రతి చోట పాలనలో తాము పడుతున్న ఇబ్బందులు ఏకరవు పెడుతున్నారని తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతిని«ధులు కొలుసు పార్థసారథి, జోగి రమేష్, పైలా సోమినాయుడు, నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లాది విష్ణు, బొప్పన భవకుమార్, ప్రచార విభాగ రాష్ట్ర కార్యదర్శి జొన్నల శ్రీనివాసరెడ్డి, ప్రచార కమిటీ నగర అధ్యక్షుడు పొతిరెడ్డి సుబ్బారెడ్డి, నేతలు బెల్లంకొండ రామకృష్ణంరాజు, కె.సంజీవరెడ్డి, పి.రామరాజు పాల్గొన్నారు.

పాదయాత్ర విజయవంతం చేయండి: వైఎస్సార్‌ సీపీ విజయవాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను
సాక్షి,అమరావతిబ్యూరో: వైðఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ విజయవాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పిలుపునిచ్చారు. ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర ఇప్పటికే ఏడు జిల్లాల్లో పూర్తయిందన్నారు. శనివారం ఉదయం గుంటూరుజిల్లా తాడేపల్లి నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర కనకదుర్గమ్మ వారధి వద్ద కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తుందన్నారు.  విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గపరిధిలో ప్రజా సంకల్పయాత్ర విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు, సింసిద్ధంగా ఉన్నారని చెప్పారు. అనంతరం శనివారం ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు.

Advertisement
Advertisement