రాజ్‌ థాక్రే సంచలన వ్యాఖ్యలు

15 May, 2018 14:42 IST|Sakshi
ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ థాక్రే (ఫైల్‌ఫోటో)

సాక్షి, ముంబయి : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల ఎంఎన్‌ఎస్‌ పెదవివిరిచింది. కర్ణాటక ఫలితాలపై ఆ పార్టీ చీఫ్‌ రాజ్‌ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఫలితాలను ఈవీఎంల విజయంగా థాకరే అభివర్ణించారు. ఈవీఎంల పనితీరుపై సందేహం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. మరోవైపు ఈవీఎంలపై కాంగ్రెస్‌ పార్టీ మరోసారి సందేహం వ్యక్తంచేసింది .

ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్ల వినియోగానికి బీజేపీ ఎందుకు సిద్ధంగా లేదని కాంగ్రెస్‌ శ్రేణులు ప్రశ్నించాయి. ‘ఈవీఎంలపై దేశంలోని పార్టీలన్నీ సందేహాలు వ్యక్తం  చేశాయి. గతంలో బీజేపీ సైతం ఈవీఎంలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్యాలెట్‌ ద్వారా ఎన్నికల నిర్వహణకు బీజేపీ ఎందుకు సిద్ధంగా లేద’ని కాంగ్రెస్‌ నేత మోహన్‌ ప్రకాష్‌ అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు