భాషను కాపాడకుండా ఉత్సవాలా?: రేవంత్‌ | Sakshi
Sakshi News home page

భాషను కాపాడకుండా ఉత్సవాలా?: రేవంత్‌

Published Fri, Dec 15 2017 3:27 AM

revanth reddy commented over government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు భాషను భావితరాలకు అందించే ఏర్పాట్లు చేయకుండా ఉత్సవాలు చేయడం వల్ల ఏ ప్రయోజనమూ ఉండదని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉత్సవాల పేరిట ప్రచార ఆర్భాటానికే పరిమితం కాకుండా తెలుగు భాషను రాయడం, చదవడం నేర్పించే తెలుగు పండిట్ల విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు గురువారం రాసిన బహిరంగలేఖలో కోరారు. క్రమబద్ధీకరణ పేరుతో మూసేసిన 4,637 తెలుగు మీడియం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న భాషా పండితుల టీచర్‌ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉర్దూ ప్రథమ భాషగా ఉండే పాఠశాలల్లో ద్వితీయ భాషగా తెలుగు అధ్యయనాన్ని తప్పనిసరి చేయాలని కోరారు. భాషా పండితుల పోస్టులను అప్‌ గ్రేడ్‌ చేయాలన్నారు. రాష్ట్రంలోని అధికార కార్యాలయాల్లో తెలుగును తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొన్నారు. బమ్మెర గ్రామంలో పోతన సమాధి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ప్రతి సంస్థ బోర్డు తెలుగులో ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

Advertisement
Advertisement