22 లేదా 23న సోనియా ప్రచారం | Sakshi
Sakshi News home page

22 లేదా 23న సోనియా ప్రచారం

Published Sat, Nov 10 2018 1:41 AM

Sonia Gandhi's Telangana Assembly Election Campaign on 22nd or 23rd - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలం గాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొ నేందుకు ఈ నెల 22 లేదా 23న యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉందని ఏఐసీసీ ప్రచార కమిటీ వెల్లడించింది. ఒకరోజు పర్యట నలో భాగంగా సోనియాగాంధీ రెండు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నట్లు ఏఐ సీసీ వర్గాలు తెలిపాయి.

ఆయా ఎన్నికల ప్రచార సభల్లో సోనియా చేసే ప్రసంగాన్ని ఎల్‌ఈడీ స్క్రీన్స్‌ ద్వారా రాష్ట్రంలోని 119 నియో జకవ ర్గాల్లో ప్రదర్శించాలని ఏఐసీసీ, పీసీసీ నేతలు భావిస్తున్నారు. సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్య క్షుడు రాహుల్‌ గాంధీ ఇద్దరు ఒకే రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళికలు రూపొంది çస్తు్తన్నామని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సోనియాను కలసిన డీఎస్‌
సాక్షి, న్యూఢిల్లీ: యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీని టీఆర్‌ఎస్‌ రాజ్య సభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కలిశారు. శుక్ర వారం ఢిల్లీలోని ఆమె నివాసంలో కలసి పార్టీ కోసం పనిచేయడంపై డీఎస్‌ తన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు తెలిసింది. డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరతారన్న వార్తల నేపథ్యంలో సోనియాను ఆయన కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. డీఎస్‌ చేరికపై సానుకూలంగా ఉన్న కాంగ్రెస్‌ అధిష్టానం ఆయ నకు ప్రజా కూటమిలోని మిత్రపక్షాల మధ్య సమన్వయం కుదిర్చే బాధ్యతలు అప్పగిం చినట్టు సమాచారం.

ఓబీసీలకు సముచిత స్థానం కల్పించాలి: చిత్తరంజన్‌ దాస్‌
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర జనాభాలో 56% ఉన్న ఓబీసీలకు టికెట్ల కేటా యింపులో సముచిత స్థానం కల్పించాలని టీపీసీసీ ఓబీసీ సెల్‌ చైర్మన్‌ చిత్తరంజన్‌ దాస్‌ పార్టీ హైకమాండ్‌ను కోరారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లా డుతూ.. ఒక వర్గానికి అధిక టికెట్లు కేటాయిం చడం సమంజసం కాదని.. ఓబీసీ, మైనారిటీల కు సముచిత స్థానం కల్పించినప్పుడే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని అభిప్రాయ పడ్డా రు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలంటే పార్టీలో అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం దక్కాలన్నారు. 

Advertisement
Advertisement