కేసీఆర్‌ పాలన ‘పైన పటారం..లోన లొటారం’ | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ పాలన ‘పైన పటారం..లోన లొటారం’

Published Fri, Dec 13 2019 11:52 AM

Telangana BJP State President Laxman Comments On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు.  శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో​ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఆర్థికమంత్రి ప్రమేయం లేకుండా ఆర్థికశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారన్నారు. ‘సీఎం కేసీఆర్‌ తీరు ఆవు తోలు కప్పుకున్న పులిలా ఉందని’ వ్యాఖ్యానించారు. కడుపులో కత్తులు పెట్టుకుని.. నోట్లో చక్కెర పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పాలన ‘పైన పటారం..లోన లొటారం’ అనే రీతిలో ఉందన్నారు.

ఇంటర్‌ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని, ఐదు వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలేని పరిస్థితిలో కేసీఆర్‌ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగ పోస్టులు ఖాళీలు ఉన్నాయని.. ఆరేళ్లలో 30వేల పోస్టులు మాత్రమే భర్తీ చేశారన్నారు. టీఎస్‌పీఎస్సీ ఉనికి తెలంగాణలో ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ లేదు..ఐఆర్‌ లేదని లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement