Sakshi News home page

టీఆర్‌ఎస్‌పై విష ప్రచారం

Published Sun, Nov 4 2018 2:06 AM

Vicious campaign on TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌పై సోషల్‌ మీడియాలో కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ ఆరోపిం చారు. సోషల్‌ మీడియాను మంచి కోసం వినియోగించుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ ప్రజల గుండెల్లో ఉందని చెప్పారు. భూమి లేని కుటుంబాలకు రైతు బీమా వంటి పథకాన్ని అమలు చేయాలనే ఆలోచన టీఆర్‌ఎస్‌కు ఉందని తెలిపారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఈటల విలేకరులతో మాట్లాడారు. ‘చంద్రబాబు వ్యవసాయం దండుగ అన్నారు.

కరెంటు ఛార్జీలు తగ్గించమంటే కాల్పులు జరిపారు. బాబుకు వ్యతిరేకంగా పోరాడిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఆయనతో కలుస్తోంది. పొరపాటున కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణకు పాత రోజులే వస్తాయి. ఎన్నికల ప్రచారంలో ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. కొందరు కావాలని సోషల్‌ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలను ఎదుర్కోవడం టీఆర్‌ఎస్‌కు కొత్తకాదు. మహాకూటమి బలహీనతల నుం చి పుట్టింది. దానికి ప్రజల మద్దతు లేదు. డిసెంబర్‌ 11న ఓట్ల లెక్కింపు రోజున అన్నీ బయటపడతాయి. చిత్తశుద్ధితో రైతులకు పెట్టుబడి ఇచ్చిన ప్రభుత్వం మాదే. లక్షా తొమ్మిది వేల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది’ అని తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement