ప్రజా సంక్షేమమే వైఎస్సార్‌సీపీ సంకల్పం | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమమే వైఎస్సార్‌సీపీ సంకల్పం

Published Thu, May 3 2018 11:33 AM

Vijaya Sai Reddy Padayatra In Visakhapatnam - Sakshi

మద్దిలపాలెం (విశాఖ తూర్పు): ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంకల్పమని, దీన్ని దృష్టిలో ఉంచుకునే పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్లీనరీ సమావేశాలలో నవరత్నాలకు రూపకల్పన చేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. జననేత ప్రజాసంకల్పయాత్రను ఆశీర్వదించాలని, సంఘీభావం తెలపాలని కోరుతూ విశాఖ నగరంలో గల అన్ని వార్డులను కలుపుకుంటూ బుధవారం నుంచి ఆయన సంఘీభావ యాత్రకు శ్రీకారం చుట్టారు. యాత్ర ప్రారంభించే ముందు ఆయన నగర పార్టీ కార్యాలయంలో వైఎస్సార్, అంబేద్కర్‌ విగ్రహాలను పూలమాలు వేసి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు ఆంధ్రరాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తారని దృఢగా విశ్వసిస్తూ మా పార్టీని, మా పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి తీసుకువచ్చి  పదికాలాలపాటు,దశబ్ధాల పాటు పరిపాలన అందించాలనే సంఘీభావ పాదయాత్రను చేపట్టడం జరిగిందని ప్రజాసంకల్పయాత్ర లోజగన్‌కు  రాష్ట్ర, ఉత్తరాంధ్ర ప్రజానీకంగా ఆశీస్సులు అందించాలన్నారు. రాష్ట్ర విభజనలో భాగంగా పునర్వీభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేకహోదా , అంశాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసాయన్నారు.

ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు మా పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్ళగా పోరాటం చేస్తూనే ,ప్లీనరీ సమావేశాలలో నవరత్నాలను ప్రకటించారన్నారు. ఆతర్వాత నవంబర్‌ 6 , 2017 నుంచి ప్రజాసంకల్పయాత్రను ఆయన ప్రారంభించారన్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అప్పట్లో ప్రజాప్రస్థానం పేరుతో ఏవిధంగా అయితే ప్రజలదగ్గరు వచ్చి వారి వాణి, బాణీతోపాటు మనస్సును తెలుసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగాపాలన అందించేందుకు  పాదయాత్ర చేపట్టారన్నారు. అదేవిధంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రను చేపట్టారన్నారు. ఈ యాత్ర అతిత్వరలోనే 2వేల  కిలోమీటర్లు పూర్తి కానుందన్నారు. ఈయాత్ర పూర్తి అయ్యేలోపల ప్రకటించిన  నవరత్నాలు  అమలకు రాష్ట్రాభివృద్ధికి ఏ వి«ధనాలు అవలంభించాలనే అంశాలను తెలుసుకునేందుకే ప్రజాసంకల్పయాత్ర చేపట్టారన్నారు.  విశాఖ జిల్లా ప్రజలందరికి ప్రజాసంకల్పయాత్ర గురించి సంఘీభావ యాత్ర ద్వారా మరింత తెలియజనున్నామన్నారు.దీన్ని ద్వారా పార్టీ క్షేత్రస్థాయిలో పటిష్టం చేసుకోనున్నామన్నారు. 13జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో మరింత వెనుబడి వున్నాయన్నారు. ఉత్తరాంధ్రు అభివృద్ధికి స్వర్గీయ రాజశేఖర్‌రెడ్డి ఎన్నో అభివృద్ధి పథకాలను అమలు చేశారన్నారు. ఉత్తరాంధ్ర సుజలస్రవంతి పథకం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ది,ఉత్తరాంధ్ర అభివృద్ది రాజశేఖర్‌రెడ్డి హయంలోనే జరిగిందన్నారు.ఐదేళ్ల పాలన ఆయన అందించిన మంచి పరిపాలనను అదే విధంగా మంచి పరిపాలన అందించేందుకు జననేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రతో ప్రజలలో స్థితి గతులు తెలసుకుంటున్నారన్నారు. దీన్ని సంఘీభావ యాత్ర చేపట్టామన్నారు.

నేటి పాదయాత్ర ఇలా
సంఘీభావ యాత్ర రెండో రోజైన గురువారం ఉదయం 8 గంటలకు జగ్గు జంక్షన్‌ వుడా కాలనీలో ప్రారంభమై.. సీతానగర్, పెదగంట్యాడ, టీఎన్‌ఆర్‌ స్కూల్‌ మీదుగా సాగుతూ.. గాజువాక నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి నివాసం మీదుగా.. బీసీరోడ్డులోకి వస్తుంది. విరామం అనంతరం సాయంత్రం 4 గంటలకు బీసీ రోడ్డు నుంచి సాగుతూ.. పశ్చిమ నియోజకవర్గంలోకి అడుగు పెడతారు. పశ్చిమ నియోజకవర్గంలో సాగే పాదయాత్రకు ముఖ్య అతిథిగా పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ హాజరు కానున్నారని నగర అధ్యక్షుడు మల్ల విజయ్‌ప్రసాద్‌ తెలిపారు. జింక్‌ గేట్‌ నుంచి హిమాచల్‌నగర్, గణపతి నగర్, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కాలనీ, అశోక్‌ నగర్‌ మీదుగా ఇందిరాకాలనీ, జనతాకాలనీ, హైస్కూల్‌ రోడ్డు, ఏడు గుళ్ల జంక్షన్‌ వద్దకు చేరుకుంటుంది. మల్కాపురం రెడ్డి కాలనీలో బహిరంగ సభలో విజయసాయిరెడ్డితో పాటు బొత్స సత్యనారాయణ ప్రసంగిస్తారు. అనంతరం.. ఏడు గుళ్ల జంక్షన్‌లో రాత్రి బస చేస్తారు. రెండో రోజున 51, 50, 62, 47,48 వార్డుల మీదుగా సాగనుంది.

Advertisement
Advertisement