‘పాల్ కాళ్లు పట్టుకునే స్థితికి దిగిజారిపోయావా బాబూ’

27 Mar, 2019 11:20 IST|Sakshi
కేఎ పాల్‌, చంద్రబాబు (ఫైల్‌ ఫొటో)

ట్విటర్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్స్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఆఖరికి కేఏ పాల్‌ కాళ్లు పట్టుకునే స్థితికి దిగిజారిపోయావా చంద్రబాబూ.. అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గడువు దాటాక కేఏ పాల్.. భీమవరంలో నామినేషన్ వేసేందుకు వెళ్లడం.. అంతా చంద్రబాబు స్కెచ్ ప్రకారమే జరిగిందని ఆరోపించారు. చివరకు పాల్ కాళ్లు పట్టుకునే స్థితికి దిగిజారిపోయావా బాబూ.. అని ఎద్దేవా చేశారు. అతని గుర్తు, కండువా రంగు, అభ్యర్థుల ఎంపిక అంతా చంద్రబాబే డిసైడ్ చేశారన్నారు. భూకంపం వచ్చినపుడు కొండలు కూడా బద్దలవుతాయని పరోక్షంగా తమ గెలుపును తెలియజేస్తూ హెచ్చరించారు. 

చదవండి: చంద్రబాబు జిమ్మిక్కులకు ఈసీ ఝలక్‌

తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ కూటమి ‘ట్రక్కు’ గుర్తుతో అభ్యర్థులను నిలబెట్టిందని, టీఆర్‌ఎస్ ‘కారు’ గుర్తును పోలి ఉండటంతో ట్రక్కుకు కూడా ఓట్లు పడ్డాయన్నారు. కానీ కారు పార్టీనే గెలిచిందని గుర్తు చేశారు. ఏపీలో అదే నీచానికి ఒడిగట్టిన కెఎపాల్ ‘హెలికాప్టర్‌’తో ఫ్యాన్‌కు నష్టం కలిగించాలని చూస్తున్నాడని, ఎన్ని కుట్రలు చేసినా తమ విజయాన్ని ఎవరు ఆపలేరని జోస్యం చెప్పారు.

పాల్‌‘ట్రిక్స్‌’ : ప్రజాశాంతి పార్టీ పేర్ల గిమ్మిక్కు

​​​​​​​నువ్వు గెలిచావ్‌ మాధవ్‌..
‘సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి హిందూపూర్ ఎంపీ స్థానానికి పోటీ చేయాలనుకున్న బీసీ యువకుడు గోరంట్ల మాధవ్ పేరు వింటే చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు. రాజీనామా చేస్తే రిలీవ్ చేయనన్నాడు.. ట్రిబ్యునల్ తీర్పుపై చంద్రబాబు అప్పీల్ కెళ్తే హైకోర్టు మొట్టి కాయ వేసింది. నువ్వు గెలిచావ్ మాధవ్.’  అంటూ చంద్రబాబు తీరును విమర్శించారు. ‘ప్యాకేజి, ప్రీపెయిడ్, పార్టనర్, పావలా...ఈ పేర్లతో ఎవర్ని పిలుస్తారో రాష్ట్రంలో పాలు తాగే పిల్లాడినడిగినా తడుముకోకుండా చెబుతాడు. తను అమ్ముడు పోయి, టికెట్లను మరొకరికి అమ్ముకొనే అజ్ఞానికి విలువల గురించి ఏం తెలుసు? డబ్బు ముట్టిందా? గెంతులేసామా? షో అయిపోయిందా? ఇలాగే ఉంటుంది.’ పరోక్షంగా పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. అలాగే పవన్‌, చంద్రబాబుల ప్రచార బిల్డప్‌లపై మీమ్‌ను సైతం ట్వీట్‌ చేశారు. ఎన్నికల ముందు పేదవారిగా అద్భుత నటన కనబరుస్తున్నారని, ఎన్నికలయ్యాక రిచ్‌గా.. ప్రత్యేక విమానాల్లో తిరుగుతారని ఎద్దేవా చేశారు.SaiRaaPunch #సైరాపంచ్ pic.twitter.com/sdNyPHaVya

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు