‘సీఎం నేమ్ ప్లేట్ సృష్టించి.. పిచ్చికూతలు’

16 Apr, 2019 11:02 IST|Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి ఆఫీస్ నేమ్ ప్లేట్ ఎవరు తయారు చేయిస్తారో తెలియదా? అంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రి దేవినేని ఉమాపై మండిపడ్డారు. ఎవరూ సొంతంగా తయారు చేయించుకుని ఆఫీసు ముందు తగిలించుకోరని ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. మీరే ఒక గ్రాఫిక్ నేమ్ ప్లేట్ సృష్టించి దానిపై పిచ్చికూతలు కూస్తున్నారని అందరికీ తెలిసిపోయిందని, ఫ్రస్టేషన్‌లో మీ మాటలే కాదు చేతలూ అసహ్యం కలిగిస్తున్నాయని ధ్వజమెత్తారు.

జీవితాంతం వ్యవస్థల్ని మేనేజ్ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడని నిప్పులు చెరిగారు. ఫిర్యాదులుంటే చెప్పొచ్చని, ఇవసలు ఎన్నికలే కావనడం, పోలింగు ముగిసాక ఓటింగ్ మెషిన్లను ట్యాంపర్ చేస్తారనడం మానసిక నియంత్రణ కోల్పోయిన వ్యక్తి చేసే ఆరోపణలని ధ్వజమెత్తారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు