280వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | Sakshi
Sakshi News home page

280వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Published Sat, Oct 6 2018 5:59 PM

YS Jagan 280th Day Praja Sankalpa Yatra Schedule - Sakshi

సాక్షి, విజయనగరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 280వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతూంది. జననేత ఆదివారం ఉదయం విజయనగరంలోని గుర్ల మండలం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని కెల్ల మీదుగా రెల్లి పేట, గుర్ల వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం గుర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. 

 

Advertisement
Advertisement