అన్ని రాజకీయ పక్షాలకు వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి | Sakshi
Sakshi News home page

అన్ని రాజకీయ పక్షాలకు వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి

Published Tue, Mar 20 2018 10:00 AM

YS Jagan Appeal To All Parties To Cooperate and No Confidence Motion - Sakshi

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాసతీర్మానం చర్చకు వచ్చేలా అన్ని రాజకీయ పక్షాలూ సహకరించాని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో ఆయా పార్టీలు చేస్తోన్న ఆందోళలను గౌరవిస్తూనే, వారి సమస్యలను అర్థం చేసుకుంటూనే.. ఏపీ ప్రజల ఆకాంక్షకు గుర్తించాలని కోరారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తోన్న ఆయన మంగళవారం ఉదయం ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా జీవన్మరణ సమస్య. హోదా ఇవ్వని కారణంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాం. సభలో ఎలాంటి అవాంతరాలు లేకుండా అవిశ్వాసంపై చర్చజరగాల్సిన అవసరంఉంది. ఇందుకు సహకరించాల్సిందిగా అన్ని పార్టీలకూ విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

విప్‌ జారీ చేసిన వైఎస్సార్‌సీపీ: ప్రత్యేక హోదా హామీని అమలు చేయని కారణంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై నేడు సభ ముందుకు రానుంది. అయితే హౌస్‌ ఆర్డర్‌లో ఉన్నప్పుడు మాత్రమే చర్చకు అవకాశం ఉంటుంది. ఇంతకుముందు రెండు సార్లు ఇచ్చిన నోటీసులపై సభలో చర్చ జరగని దరమిలా సోమవారం మూడోసారి వైఎస్సార్‌సీపీ ఎంపీలు అవిశ్వాసం నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. అవిశ్వాసానికి మద్దతు తెలపాలంటూ పార్టీ ఎంపీలకు వైఎస్సార్‌సీపీ విప్‌ జారీచేసింది.

Advertisement
Advertisement