నేను 13 రోజులు యుద్ధం చేశా : వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

నేను 13 రోజులు యుద్ధం చేశా : వైఎస్‌ జగన్‌

Published Wed, Dec 6 2017 8:27 PM

YS Jagan mohan reddy reaction on nandyala by Poll Result - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘నంద్యాలలో చంద్రబాబు నాయుడు రూ.200 కోట్లు ఖర్చు పెట్టారు. రూ.6వేల నుంచి 8 వేలు ఇచ్చి మరీ ఓట్లు కొన్నారు. టీడీపీకి ఓటేయకపోతే పింఛన్లు, రేషన్‌ కట్‌ చేస్తామని బెదిరించారు. అలాంటి సమయంలో నాయకుడిగా  ముందుండి నేను 13 రోజులు యుద్ధం చేశా.’  అని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్ర నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ఉప ఎన్నిక సందర్భంగా నేను అక్కడ ఉన్నాను కాబట్టే అందరు ధైర్యంగా ఉన్నారు. పార్టీ నేతలు నా వెంట నడిచారు. గట్టిపోటీ ఇచ్చాం. ప్రలోభాలు పెట్టబట్టే టీడీపీ గెలిచింది. ఉప ఎన్నికకు, సాధారణ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. నంద్యాలలోలాగ సాధారణ ఎన్నికల్లో చేయడానికి కుదరదు. సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు రూ.4వేలు ఇస్తే ప్రజలు తీసుకోరు.

జగన్‌ సీఎం అయితే అంతకంటే ఎక్కువ మేలు చేస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. చంద్రబాబుకు ఆ విషయం తెలుసు. అందుకే ఫిరాయింపుదారుల స్థానాల్లో ఉప ఎన్నికలకు భయపడుతున్నారు. నంద్యాలలో గెలుపు వాపు కాదు.. బలం అనుకుంటే ఎప్పుడో ఎన్నికలకు వెళ్లేవారు చంద్రబాబుకు సిగ్గుండదు. అన్నీ దులుపుకుని పోతారు. చంద్రబాబుకు సిగ్గుండదు. అన్నీ దులుపుకుని పోతారు. మా పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. అందరు బాగా పని చేస్తున్నారు. రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. అంతా కలిసికట్టుగా ఎన్నికలకు సిద్ధం అవుతున్నాం. ప్రశాంత్‌ కిశోర్‌ సహా ఎవరు మంచి సలహాలు ఇచ్చినా తీసుకుంటాం. మంచి ఎక్కడ ఉన్నా స్వీకరించి అమలు చేస్తాం. ప్రజల ఆదరణ, సర్వేల ఆధారంగానే ఎవరికైనా టికెట్లు ఇస్తాం.’  అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement