‘అవునండీ.. చంద్రబాబు’ జగన్‌ చెప్పిన కథ | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 5 2018 7:05 PM

YS Jagan Narrates A Funny Story Of Chandrababu Naidu - Sakshi

సాక్షి, తణుకు : ప్రజాసంకల్పయాత్ర 181వ రోజు పాదయాత్రలో భాగంగా తణుకులో నిర్వహించిన బహిరంగసభలో ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగనమోహన్‌ రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘వేలుకు ఉంగరం తొడుక్కోను, బంగారం పెట్టుకోను అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల మాట్లాడారు. పాదయాత్రలో నాదగ్గరికి వచ్చిన ఓ వ్యక్తి.. మీకో కథ చెబుతా అన్నా.. అది బహిరంగ సభలో చెప్పండని నన్ను కోరాడు’. అని ఆ కథను వైఎస్‌ జగన్‌ ప్రజలకు చదివి వినిపించారు.

ఆ కథ ఏమిటంటే..
‘‘అవునండీ.. చంద్రబాబు గారి వేలికి ఉంగరం, చేతికి గడియారం, మెడలో గొలుసు కూడా ఉండదండీ.. కానీ చంద్రబాబు గారు 2 ఎకరాల నుంచి 4 లక్షల కోట్లు సంపాదించారండీ.
అవునండీ.. చంద్రబాబు గారి వేలికి ఉంగరం, చేతికి గడియారం, మెడలో గొలుసు కూడా ఉండదండీ.. కానీ హైదరాబాద్‌లో రాజభవనం కూడా కట్టారండీ..
అవునండీ.. చంద్రబాబు గారి వేలికి ఉంగరం, చేతికి గడియారం, మెడలో గొలుసు కూడా ఉండదండీ.. కానీ వేల కోట్ల విలువ చేసే హెరిటేజ్‌ కంపెనీ ఉందండీ..   
అదేందో అండీ.. రూ.150 విలువ చేసే హెరిటేజ్ షేర్‌ విలువ రూ.900 పెరిగిందండీ.. అది కూడా నోట్ల రద్దు రెండు రోజుల ముందే పెరిగిందండీ.. 
అదేందో అండీ.. ఆ షేర్‌లను కూడా సరిగ్గా నోట్ల రద్దుకు రెండు రోజుల ముందే ఫ్యూచర్‌ గ్రూప్‌కు అమ్మారండీ..

అవునండీ.. చంద్రబాబు గారి వేలికి ఉంగరం, చేతికి గడియారం, మెడలో గొలుసు కూడా ఉండదండీ.. కానీ.. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుక్కోవడానికి నల్లధనం వస్తుందండీ.. ఆడియో వీడియో టేపులో దొరికిపోతారండీ..
అవునండీ.. చంద్రబాబు గారి వేలికి ఉంగరం, చేతికి గడియారం, మెడలో గొలుసు కూడా ఉండదండీ.. కానీ.. ప్రతిపక్ష నేతల ఎమ్మెల్యేలకు కోట్లిచ్చి కొనుక్కోవడానికి డబ్బులంటాయండీ..
అవునండీ.. బాబు గారికి మందుతాగే అలవాటు లేదండీ, కానీ చదువుకునే మా పిల్లలను తాగుడుకు బానిస చేస్తున్నారండీ..
అవునండీ.. బాబు గారికి మందుతాగే అలవాటు లేదండీ, కానీ.. సాయంత్రం ఓ పెగ్గు వేయాలని కూడా బాబుగారే చెబుతారండీ..
అవునండి.. బాబుగారు ఏ అమ్మాయి వంక చూడ లేదండీ.. కానీ అరవై తొమ్మిదేళ్ల వయసుండీ.. ఈ వయసులో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఎబ్బెట్టుగా ఉందండీ..
తిరకాసు ఎంటంటే అండీ.. తన ఇంటికి కూతవేటు దూరంలో చిన్న పిల్లలు, యువతులపై అత్యాచారాలు జరుగుతుంటే పట్టించుకోడండీ..

అవునండీ బాబుగారికి దైర్యం ఎక్కువండీ.. కానీ ఒక్క విచారణకు సిద్దపడండీ.. ఎప్పుడు అవినీతి కేసులు వచ్చినా స్టేలు తెచ్చుకుంటాడండీ.. అదేంటోండీ.. ఆ స్టేలు ఎప్పుడూ.. అలాగే ఉంటాయండీ..
అవునండీ బాబుగారికి దైర్యం ఎక్కువండీ.. కానీ ఎంపీలతో రాజీనామా చేయించడండీ..
అవునండీ బాబుగారు ఎవరికి అన్యాయం, మోసం చేయడండీ.. కానీ ఎన్నికలప్పుడు ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ అమలు చేయడండీ..
అవునండీ బాబుగారు ఎవరికి అన్యాయం, మోసం చేయడండీ.. కానీ ఎన్నికలప్పుడు ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ హామీ అమలు చేయడండీ..
అవునండీ బాబుగారు ఎవరికి అన్యాయం, మోసం చేయడండీ.. కానీ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇవ్వడండీ..
అవునండీ బాబుగారు ఎవరికి అన్యాయం, మోసం చేయడండీ.. కానీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడండీ.. కానీ ఎమ్మేల్యేలకు మాత్రం దోపిడీ చేయమని శిక్షణ ఇస్తాడండీ..

పంచ భూతాలను వదలకుండా మింగేస్తాడండీ.. రాజధాని భూములు, ఇసుక, అన్నీ దోచుకుంటాండీ.. కాంట్రాక్టర్ల నుంచి లంచాలు కూడా తీసుకుంటారండీ.. చివరికి ఏయిర్‌ ఏషియాలో కూడా చేతివాటం ప్రదర్శించాడని ఈ రోజు వార్తల్లో చదువానండీ..

అవునండీ బాబుగారిదీ 40 ఏళ్ల అనుభవం కదాండీ.. మెబైల్‌, కంప్యూటర్‌, సాఫ్ట్‌ వేర్‌లు బాబుగారే కనిపెట్టారండీ.. సత్యనాదేళ్లకు ఆయననే ట్రైనింగ్ ఇచ్చాడండీ.. చివరకు పీవీ సింధూకు కూడా ఎలా ఆడాలో ట్రైనింగ్‌ ఇచ్చాడండీ. ఆయన కొడుక్కు మ్రాతం హార్డ్‌వేర్‌, సాప్ట్‌ వేర్‌ను చేయలేకపోయారండీ.. ఆయన కొడుకుని జనాలు పప్పు అంటున్నారండీ.. అయన చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులండీ’’  అని ఆ వ్యక్తి ఈ కథ ఇచ్చిపోయాడు అని వైఎస్‌ జగన్‌ ప్రజలకు తెలియజేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement