ప్రజా సంకల్ప యాత్ర జయప్రదం చేయండి | Sakshi
Sakshi News home page

ప్రజా సంకల్ప యాత్ర జయప్రదం చేయండి

Published Thu, Jun 7 2018 7:36 AM

Ys Jagan Praja Sankalpa Yatra In East Godavari - Sakshi

రామచంద్రపురం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రను జయప్రదం చేయాలని పార్టీ అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ పిలుపునిచ్చారు. గాంధీపేటలోని పార్టీ కార్యాలయంలో బుధవారం రామచంద్రపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొవ్వూరు–రాజమహేంద్రవరం బ్రిడ్జి మీదుగా ఈ నెల 12వ తేదీ సాయంత్ర 3.30 గంటలకు జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర జిల్లాలో ప్రవేశిస్తుందని బోస్‌ తెలిపారు.

సాయంత్ర 6 గంటలకు కోటిపల్లి బస్టాండ్‌ వద్ద బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ బహిరంగ సభలకు అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని రాజోలు నియోజకవర్గం నుంచి 65 టాటాఏస్‌లు, 5 బస్‌లు, 40 కార్లు, పి.గన్నవరం నుంచి 50 టాటా మేజిక్‌లు, 6 బస్‌లు, 700 మోటారుసైకిళ్లు, ముమ్మిడివరం నుంచి 10 బస్‌లు, 50 కార్లు, రామచంద్రపురం 50 కార్లు, 2 బస్సులు, 800 మోటారు సైకిళ్లు, అమలాపురం నుంచి 25 బస్సులు, 50 కార్లు, 30 టాటా ఏస్‌లు, మండపేట నుంచి 400 ఆటోలు, 12 లారీలలో సుమారు 15 వేల మంది జగన్‌ బహిరంగ సభకు తరలి వెళ్లనున్నట్లు బోస్‌ పేర్కొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు.

భీమేశ్వరాలయం నుంచి భారీ ర్యాలీ
జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు నియోజకవర్గం నుంచి 2 వేల మంది తరలి వెళ్లనున్నట్లు కో ఆర్డినేటర్‌ వేణు తెలిపారు. రామచంద్రపురం, కె.గంగవరం, కాజులూరు మండలాలతో పాటు రామచంద్రపురం పట్టణంలోని నాయకులు, కార్యకర్తలు ద్రాక్షారామ భీమేశ్వరస్వామివారి ఆలయానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుని అక్కడి నుంచి రాజమహేంద్రవరం ర్యాలీగా తరలివెళ్లనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ నాయకులు వట్టికూటి రాజశేఖర్, పట్టణ, మండల కన్వీనర్‌లు గాధంశెట్టి శ్రీధర్, పంతగడ విజయప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్‌ చింతపల్లి నాగేశ్వరరావు, మాగాపు అమ్మిరాజు, గుబ్బల ఏసురాజు, పోతురాజు బాబూరావు, తోట వీరభద్రరావు, కొండేపూడి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement