55వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | Sakshi
Sakshi News home page

55వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Published Sun, Jan 7 2018 8:53 AM

ys jagan prajasankalpayatra started-55th day - Sakshi

సాక్షి, చిత్తూరు : ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం పూడిబట్లబయలు గ్రామంలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌ అనంతరం పార్టీ జెండాను ఎగురవేసి 55వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. గుండ్లగుట్లపల్లి మీదుగా దామల చెరువు చేరుకొని రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు.

విరామం అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు​పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. పూతలపట్టు నియోజక వర్గంలోకి వైఎస్‌ జగన్‌ ప్రవేశిస్తారు. గొట్టాల క్రాస్‌ రోడ్డు మీదుగా గుండ్లపల్లి చేరుకొని వైఎస్‌ఆర్‌ విగ్రహం, పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. తరువాత సవటపల్లి, పొలకల సంతగేట్‌, పాటూరు మీదుగా చౌడుపల్లిక్రాస్‌రోడ్డు వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 6గంటలకు మొరవ పాటూరు వద్ద ప్రజాసంకల్పయాత్ర ముగియనుంది.

Advertisement
Advertisement