పేదవాడి ఇంటికయ్యే డబ్బంతా మాఫీ చేస్తాం : వైఎస్‌ జగన్‌

25 Mar, 2019 18:28 IST|Sakshi

చంద్రబాబు ప్లాట్‌ ఇస్తే తీసుకోండి

ప్లాట్‌కు కట్టాల్సిన మూడు లక్షలు మాఫీ చేస్తాం

ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ 24వేలు అందిస్తాం

నవరత్నాలతో అందరికి ముఖాల్లో చిరునవ్వులు తెస్తాం

మదనపల్లే బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌

సాక్షి, చిత్తూరు :  అధికారంలోకి రాగానే పేదవాడి ఇంటికయ్యే డబ్బంతా మాఫీ చేస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 24వేల రూపాలయను అందిస్తామన్నారు. రైతులకు గిట్టుబాబు ధర కల్పించి వారి ముఖాల్లో చిరనవ్వులు చిందేలా చేస్తామన్నారు. నవరత్నాలు తీసుకొచ్చి అందరికి మంచి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం చిత్తూరు జిల్లా మదనపల్లే నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

దళారీలకు కెప్టెన్‌గా చంద్రబాబు
మండుతున్న ఎండల్లో కూడా చిక్కటి చిరునవ్వులతో అప్యాయతలను చూపిస్తూ ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరీ ఆత్మీయతకు రెండు చేతులు జోడించి శిరస్సు వహించి నమస్కరిస్తూ..పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మదనపల్లె గుండా 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ఆరోజులు నాకు బాగా గుర్తున్నాయి. మదపల్లె నియోజకవర్గంలో దేశంలో కెల్లా రెండో అతిపెద్ద మార్కెట్‌ ఉంది. అటువంటి మదనపల్లెలలోనే గిట్టుబాటు ధరలేక టమాటాలు రోడ్డుపై పడేసిన పరిస్థితిని నా కళ్లతో చూశా. ఎకర సాగు చేయడానికి కనీసం 70వేల నుంచి లక్ష దాక ఖర్చు అవుతుందని, అటువంటిది కిలో టమాటాలు రూపాయికి అమ్ముకుంటున్నామని అని రైతులు చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఒకవైపున ఏమో గిట్టుబాటు ధరలు లేవు. మరోపైపు గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన ప్రభుత్వం చివరికి మార్కెట్‌ కమిషన్‌ పేరిట 10శాతం వసులు చేస్తున్నారు. హెరిటేజ్‌ కంపెని కోసం దళారీలకు చంద్రబాబు కెప్టెన్‌ అయ్యారు. రైతుల దగ్గరనుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి తాను ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని రైతులు నాతో చెప్పారు. 

హెరిటేజ్‌ కోసం చిత్తూరు డెయిరీని సమాధి చేశారు
ఇదే నియోజకవర్గంలో పాల బాటిళ్లను తీసుకొచ్చి అన్నా ఒక బాటిల్‌ మినరల్‌ వాటర్‌కు అయ్యే రేటే ఒక లీటర్‌ పాలకు ఇసున్నారని చెప్పారు. హెరిటేజ్‌ కోసం చంద్రబాబు చిత్తూరు డెయిరీని సమాధి చేశారని ఇక్కడి రైతులు చెప్పారు. సొంత ఫ్యాక్టరీ కోసం పాల రైతుల పొట్టకొట్టారు. ప్రతి పాడి రైతుకు చెబుతున్నా నేను ఉన్నాననే హామీ ఇస్తున్నాను.

ప్రతి చేనేత కుటుంబానికి 24 వేలరూపాల
పాదయాత్రలో భాగంగా చేనేతలతో ఆత్మీయ సమ్మెళనం ఇక్కడ చేశాం. ఆ రోజు చేనేత కార్మికులు చెప్పిన బాధలు విన్నా. చేనేతలకు గుర్తింపు కార్డులు లేవు. సిల్క్‌ సబ్సిడీ పేరుతో ఏరకంగా చేనేత కార్మికులను మోసం చేశారో చెప్పారు. 35వేల కుటుంబాలాను కుదించి కేవలం 3వేలకు మందికి మాత్రమే సిల్క్‌సబ్సిడీ ఇస్తున్నారని చెప్పారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి 24 వేలరూపాయలను ఇస్తానని హామీ ఇస్తున్నాను.

పేదవాడి ఇంటికయ్యే డబ్బంతా మాఫీ చేస్తాం
చంద్రబాబు ప్రభుత్వం మదపల్లేలో ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదు. ఏ రకంగా చంద్రబాబు ప్లాట్లపేరుతో మోసం చేస్తున్నారో గతంలో నేను చెప్పా. 300 అడుగుల ప్లాట్‌ను రూ. 6లక్షలకు అమ్ముతున్నారు. ఆ ఆరు లక్షల్లో లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం, మరో లక్షన్నర కేంద్రం ఇస్తుందట. మిగిలిన మరో మూడు లక్షల రూపాయలు అప్పుగా రాసుకొని  ఆ ఇంటికి నెలనెలా రూ. 3వేలు కడుతూ పోవాలట. లంచాలు తీసుకునేది చంద్రబాబు అయితే .. పేదవాడు నెలనెల మూడు వేలు కడుతూ పోవాలట. ఇదేక్కడి ధర్మం. ప్రతి పేదవాడికి చెప్పుతున్న చంద్రబాబు ప్లాట్‌ ఇస్తే తీసుకోండి. మన ప్రభుత్వం వచ్చాక మీరు కట్టాల్సిన మూడు లక్షలు మాఫీ చేస్తాం.

హంద్రీనీవాపై చంద్రబాబు డ్రామాలు
దివంగతనేత వైఎస్సార్‌హయంలో పూర్తయిన హంద్రీనీవా ప్రాజెక్టులో రెండు చెంబుల నీళ్లు పోసి నేనే కట్టానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. వైఎస్సార్‌ హయంలోనే హంద్రీనీవా కాలువలు పూర్తయ్యాయి. నాన్న గారి హయంలో ఈ ప్రాజెక్టుకు రూ.4076కోట్లు ఖర్చు చేసి 80శాతం పనులను పూర్తి చేశారు.మిగిలిన 20శాతం పనులను కూడా చంద్రబాబు లంచాలు తీసుకొని పూర్తి చేశారు. పాదయాత్రలో మీ కష్టాలను విన్నాను. మీ కష్టాలను చూశాను. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటుందో తెలుసుకున్నాను. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి చెబుతన్నా నేను ఉన్నాను అనే భరోసా​ఇస్తున్నాను.

మీ అందరికి చెబుతున్న నేను ఉన్నాను
ఫీజు రియంబర్స్‌మెంట్‌ రాక ఇంజనీరింగ్‌ చదవాలంటే ఫీజులు లక్షలు దాటుతున్న పరిస్థితులు ఉన్నాయి. గవర్నమెంట్‌ అరకొర మాత్రమే ఇస్తుంది. తల్లితండ్రులు పిల్లలను చదవుల కోసం ఆస్తులను అమ్ముకుంటున్న పరిస్థితని నా కళ్లారా చూశా. ప్రతి తల్లికి నేను చెబుతున్నా..నేను ఉన్నాను. 108నెంబర్‌కు ఫోన్‌ కొడితే కుయ్‌..కుయ్‌ అంటు 20నిమిషాల్లో అబుంలెన్స్‌ రాక ప్రాణాలు పొగొట్టుకున్న కుటుంబాలను చూశా. మందులకు డబ్బులు లేక అవస్థలు పడుతున్న కుటుంబాలను చూశా.అంతటి బాధలు పడుకుతన్న కూడా మనసు లేని ప్రభుత్వాన్ని చూశా. మీ కష్టాన్ని నేను చూశా. అంబులెన్స్‌ రాక ప్రాణాలు పోగొట్టుకున్న ప్రతి కుటుంబానికి చెబుతున్నానేను ఉన్నాను. మద్యం షాపులు ఎక్కువైపోయి మద్యానికే బాసిసలు అయి కుటుంబాలు నాశనం అవుతున్న పరిస్థితులు చూశా. ప్రతి గ్రామాల్లో మూడు నాలుగు బెల్టు షాపులు కనిపిస్తాయి. చంద్రబాబు పాలనలో గ్రామాల్లో ఉన్న ప్రతి దుకాణంలో మం‍దు దొరుకుతుంది. రాత్రి 7 దాటితే ఆడపిలల్లను బయటకు పంపించాలంటే తల్లిదండ్రులను భయపడుతున్న పరిస్థితిని కనిపిస్తుంది. తాగుడుతో కుటుంబాలు నాశనం అవుతున్న పరిస్థితిని చూశా. ప్రతి అక్కాచెల్లికి చెబుతున్నా నేను ఉన్నాను.

డబ్బులకు మోసపోవద్దు
ఎన్నికలు దగ్గరుకు వస్తే చంద్రబాబు రోజకో సినిమా చూపిస్తాడు. అధికారం కోసం దేనికైనా తెగిస్తాడు చంద్రబాబు. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి.

ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్‌ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌​ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి నవాజ్‌, ఎంపీ అభ్యర్థి మిథున్‌లపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు