వేంపల్లి నుంచి రెండో రోజు యాత్ర ప్రారంభం | Sakshi
Sakshi News home page

వేంపల్లి నుంచి రెండో రోజు యాత్ర ప్రారంభం

Published Tue, Nov 7 2017 9:06 AM

YS Jagan Starts Praja Sankalpa Yatra Second Day - Sakshi

సాక్షి, వేంపల్లి:  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రెండో రోజు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం వైఎస్సార్‌ జిల్లా వేంపల్లి శివారు నుంచి పాదయాత్ర మొదలు పెట్టారు. అశేషంగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు వెంటరాగా ఈ ఉదయం 9 గంటలకు రెండోరోజు యాత్ర ఆరంభించారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు అభిమానులు ఎగబడ్డారు. జననేతతో మాట్లాడేందుకు భారీగా జనం తరలివచ్చారు. వారందరినీ ఆయన పలకరించారు.

వేంపల్లి క్రాస్‌ రోడ్డు, వైఎస్‌ కాలనీ, కడప-పులివెందుల హైవే, సర్వరాజపేట మీదుగా గాలేరు-నగరి కెనాల్‌ వరకు యాత్ర సాగనుంది. ఈరోజు 12.6 కిలోమీటర్ల మేర వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేయనున్నారు. నీలతిమ్మాయిపల్లి సమీపంలోని ఈరోజు యాత్రను ముగించనున్నారు. సోమవారం ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన జననేత మొదటిరోజు 10 కిలోమీటర్లు నడిచారు. ఉదయం 9 గంటల 47 నిమిషాలకు తొలి అడుగు వేసిన ఆయన రాత్రి 6.40 గంటలకు బసకు చేరుకున్నారు. యాత్ర ప్రారంభం నుంచి రాత్రి ముగిసే దాకా చెరగని చిరునవ్వుతో ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు.

నేటి పాదయాత్ర షెడ్యూల్‌ ఇలా..
సాక్షి ప్రతినిధి, కడప :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర రెండోరోజు మంగళవారం షెడ్యూల్‌ను పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన మేరకు పాదయాత్ర వివరాలు..

  • ఉదయం 8.30 గంటలకు వేంపల్లి శివారులోని బస నుంచి జగన్‌ పాదయాత్ర ప్రారంభిస్తారు.
  • 9.05 గంటలకు రవి పెట్రోల్‌ బంకు వద్ద ప్రజలు ఆయనకు స్వాగతం పలుకుతారు. 9.50 గంటలకు వేంపల్లె నాలుగు రోడ్లకూడలిలో జగన్‌ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.  
  • 11.10 గంటలకు శ్రీనివాసకల్యాణ మండపంలో ప్రజలతో ముఖాముఖి.
  • 11.35 గంటలకు బైపాస్‌ రోడ్డులోని ఆలయంలో పూజలు
  • 12 గంటలకు వైఎస్సార్‌ కాలనీలో వైఎస్సార్‌ విగ్రహానికి పూల మాల వేస్తారు.
  • 12.20 గంటలకు కడప– పులివెందుల మార్గంలో మధ్యాహ్న భోజన విరామం.
  • మధ్యాహ్నం 3.30 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభం
  • 3.45 గంటలకు సర్వరాజపేట గ్రామానికి చేరుకుంటారు.  
  • సాయంత్రం 5.20 గంటలకు గాలేరు–నగరి కాలువ పరిశీలన.  
  • రాత్రి 8.30 గంటలకు ప్రొద్దుటూరు రోడ్డులోని నేల తిమ్మాయపల్లి వద్ద ఏర్పాటు చేసిన బసకు చేరుకుంటారు.

    (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
Advertisement