చంద్రబాబు గతాన్ని మరచి ప్రవర్తిస్తున్నారు.. | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 24 2018 4:44 PM

YSRCP MLA Suresh Slams TDP on Pattiseema Corruption Accusation - Sakshi

సాక్షి, విజయవాడ:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మొదట్నుంచీ చెబుతోందని ఆపార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  కాగ్‌ తన నివేదికలో పట్టిసీమలో అవినీతి జరిగిందని వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ చేపట్టాలని టీడీపీ ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తోందని అన్నారు.  

కానీ,  కాగ్‌ చెప్పినంత మాత్రాన విచారణ జరిపించలేమని చంద్రబాబు చెప్పడం ఆయన ద్వంద్వ వైఖరిని మరోసారి స్పష్టం చేసిందని ఎమ్మెల్యే సురేష్‌ ఎద్దేవా చేశారు. 2జీ, బొగ్గు కుంభకోణం కేసుల్లో కాగ్‌ చెప్తేనే సీబీఐ విచారణ జరిగిందన్న విషయం చం‍ద్రబాబు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై టీడీపీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కమీషన్ల పచ్చపార్టీ...
కమీషన్ల కోసమే కాంట్రాక్టర్లను మారుస్తున్నారనీ.. వాటి అంచనా వ్యయాల్ని ఇష్టారీతిన పెంచుతున్నారని సురేష్‌ ఆరోపించారు. వెలుగొండ ప్రాజెక్టు వ్యయం రూ.495 కోట్ల నుంచి 1012 కోట్లకు పెంచారని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడానికి రూ.2844 కోట్లు అవసరం కాగా కేవలం 334 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలోనే వెలుగొండ ప్రాజెక్టుకు సింహభాగం నిధుల కేటాయింపులు జరిగాయని అన్నారు.

Advertisement
Advertisement