‘సర్వేలు హెచ్చరిస్తున్నా మార్పు లేదు’ | Sakshi
Sakshi News home page

‘సర్వేలు హెచ్చరిస్తున్నా మార్పు లేదు’

Published Fri, May 4 2018 12:25 PM

YSRCP MP Vijay Sai Reddy third day padayatra in vizag - Sakshi

సాక్షి, విశాఖ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో విశాఖలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేపట్టిన సంఘీభావ యాత్ర మూడో రోజుకు చేరింది. శుక్రవారం మూడోరోజు మల్కాపురం నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆయన అడుగుడుగునా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుసాగుతున్నారు. జై ఆంధ్రా కాలనీ మీదుగా.. ఏసీ కాలనీలో యాత్ర కొనసాగుతోంది.

ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు సర్వేలు హెచ్చరిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి మార్పు లేదని మండిపడ్డారు. ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైందన్నారు. మహిళలపై అత్యాచారాల కేసుల్లో టీడీపీ మంత్రుల పేర్లు ఉండటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబుకు త్వరలోనే ప్రజలు తగిన బుద్ది చెబుతున్నారన్నారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement