మహానేత పాదాల వద్ద రాజీనామాలు.. | Sakshi
Sakshi News home page

మహానేత పాదాల వద్ద రాజీనామా లేఖలు..

Published Fri, Apr 6 2018 10:50 AM

YSRCP MPs to Submit Resignation To Lok Sabha Speaker And To Sit For Indefinite Hunger strike - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా పోరాటాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి.. పార్లమెంటు వేదికగా అలుపెరగని పోరాటం సాగించి.. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నించి.. దేశవ్యాప్తంగా చర్చనీయాం శంగా మార్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేడు అంతిమ పోరాటాన్ని ప్రారంభించింది. హోదా సాధన పోరాటంలో భాగంగా నేడు పదవులకు రాజీనామాలు చేయనున్న ఎంపీలు.. సంతకాలు చేసిన రాజీనామా పత్రాలను మహానేత వైఎస్సార్‌ పాదాల వద్ద ఉంచి, నమస్కరించారు. అనంతరం పార్లమెంట్‌కు బయలుదేరారు..

స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌: ప్రత్యేక హోదా కోసం పదవులు త్యజించేందుకు సిద్ధమైన వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆమేరకు లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్నారు. సభ నిరవధిక వాయిదా పడిన తర్వాత నేరుగా స్పీకర్‌ను కలవనున్న ఎంపీలు.. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పించిన అనంతరం నేరుగా ఏపీ భవన్‌కు వెళ్లి ఆమరణ దీక్షలో కూర్చుంటారు.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల చివరి రోజైన శుక్రవారం సభ నిరవధిక వాయిదా ప్రకటన వెలువడగానే రాజీనామాలు సమర్పిస్తామని వైఎస్సార్‌సీపీ ఎంపీలు తెలిపారు. ఆ వెంటనే ఏపీ భవన్‌ వేదికగా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోనున్నారు. ఢిల్లీలో దీక్షకు దిగనున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలకు మద్దతుగా ఏపీ వ్యాప్తంగా అన్ని చోట్లా సంఘీభావ దీక్షలు జరుగనున్నాయి. వైఎస్సీర్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ఈ మేరకు విద్యార్థులు, యువతకు ఇదివరకే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అటు ఎంపీల దీక్షా శిబిరానికి కార్యకర్తల తాకిడి మొదలైంది. వేలాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వివిధ మార్గాల ద్వారా ఢిల్లీకి పయనం అయ్యారు.

వైఎస్సార్‌ సీపీ ఎంపీల రాజీనామా లేఖలు ఇవే..

Advertisement
Advertisement