‘ఎన్నికలంటే భయపడేది చంద్రబాబే’ | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 5 2018 3:28 PM

YV Subba Reddy Slams CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, తణుకు : ఎన్నికలంటే భయపడేది సీఎం చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి 181వ రోజు పాదయాత్రలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ఏడాది సమయం ఉందనే వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేశారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ తాము ఎన్నికలకు 14 నెలలు సమయం ఉండగానే రాజీనామ చేసామన్నారు. ఎన్నికలంటే భయపడేది చంద్రబాబేనని, ఆయనకు దమ్ముంటే వైఎస్సార్సీపీ నుంచి గెలిచి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు. ఆ ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వెళ్దామని, ఫలితాలను రిఫరెండంగా తీసుకుందామని సవాల్‌ విసిరారు. దీనికి చంద్రబాబు సిద్దమేనా అని ప్రశ్నించారు.

పార్లమెంట్‌లో డ్రామాలు ఆడింది టీడీపీ ఎంపీలేనన్నారు. బుధవారం స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్‌ చేస్తామన్నారు. ఎన్నికలకు తాము భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలకు వెళ్లి భారీ మెజారిటీతో గెలిచి హోదాపై ప్రజాకాంక్షను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు తెలియజేస్తామన్నారు. చంద్రబాబే ఓటుకు నోటు కేసు కోసం హోదాను, విభజన హామీలను కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

Advertisement
Advertisement