Sakshi News home page

అన్నా.. నా కుమార్తెకు లివర్‌ సమస్య

Published Wed, Feb 7 2018 7:10 AM

people sharing their sorrows to ys jagan - Sakshi

నెల్లూరు(సెంట్రల్‌): ‘అన్నా.. నా పేరు వి.అరుణ.. మర్రిపాడు నుంచి వచ్చా. నా కుమార్తె నిహారికకు లివర్‌ సమస్యగా ఉందని, అందుకోసం సుమారు రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు’ అని అన్నారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు సమీపంలో మంగళవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించింది. చిన్నారికి లివర్‌ సమస్య వచ్చినప్పటి నుంచి తమ కుటుంబం కుంగిపోతోందని పేర్కొంది. పాలకులు, అధికారులకు పలుమార్లు అర్జీలు ఇచ్చినా తమ గోడు పట్టించుకునే నాథుడే లేరని వాపోయింది. ఏ విధంగా అయినా తన కుమార్తె ఆరోగ్యంగా ఉండే విధంగా చూడాలని జననేత వైఎస్‌ జగన్‌కు విన్నవించింది.

Advertisement
Advertisement