కొన్ని పుస్తకాలూ కాసిన్ని పరిచయాలూ | Sakshi
Sakshi News home page

కొన్ని పుస్తకాలూ కాసిన్ని పరిచయాలూ

Published Sun, Mar 22 2015 3:41 AM

కొన్ని పుస్తకాలూ కాసిన్ని పరిచయాలూ - Sakshi

సాక్షి రాకతో తెలుగునాట రెండు మేళ్లు జరిగాయి. ఒకటి- కొత్త పాఠకులు ఏర్పడ్డారు. రెండు- కొత్త సాహితీ పాఠకులు స్థిరపడ్డారు. ఆ సంఖ్య గుప్పెడంత చారెడంత కాదు. చాలా పెద్దది.  సాక్షి ఫ్యామిలీ, సాక్షి ఫన్‌డే, సాక్షి సాహిత్యం... ఈ మూడూ ఈ కొత్త పాఠకులను నెమ్మదిగా చేయి పట్టుకొని పాత, కొత్త సాహిత్య వీధుల్లో తిరుగాడించి తీసుకొని వచ్చాయి. వాదాలు, వివాదాలు, తీవ్ర ధ్వనిలో దీర్ఘశృతిలో సాగే చర్చలూ... వీటికి దూరం. కొన్ని పుస్తకాలూ... కాసిన్ని పరిచయాలూ... మరికొన్ని సంస్కారాలు... వీటిని ప్రోది చేయడమే పని. ఏకకాలంలో మూడు సీరియల్స్ నడిచిన సండే మేగజీన్ ఇంతకు మునుపు లేదు.

సాక్షి ఫన్‌డేతో సాధ్యమైంది. అనువాద కథలనూ, వందేళ్ల పునఃకథనాలనూ ప్రచురించిన ఫీచర్ పేజీలు లేవు. సాక్షి ఫ్యామిలీతోనే సాధ్యమైంది. సాహిత్య పారిభాషిక పాదాలనూ, సాహిత్య ఉద్దండులను, గొప్ప నవలలనూ, పదం ద్వారా ఆంధ్రపథంను వివరించిన సాహిత్య పేజీలు లేవు. సాక్షి సాహిత్యం ద్వారా సాధ్యమైంది. సాక్షికి కొత్త మాత్రమే తెలుసు. కొత్తగా ఏదైనా చేయడం మాత్రమే తెలుసు. సాక్షి ఆవిర్భావంలోనే ఆ జన్యువు ఉంది. పాఠకుల మనసు గెలవడమే దాని విధి.
 - ఖదీర్, సీనియర్ న్యూస్ ఎడిటర్

Advertisement

తప్పక చదవండి

Advertisement