చిరుత దాడిలో ఆ కుక్కకు ఏమైంది? | Sakshi
Sakshi News home page

చిరుత దాడిలో ఆ కుక్కకు ఏమైంది?

Published Mon, Oct 14 2019 8:41 PM

Leopard Pounces On Dog Outside House In Gujarat - Sakshi

ఓ ఇంటి ముందు కాపల ఉన్న కుక్కపై చిరుత దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంటి ఆవరణలో గుమ్మం ముందు నిద్రిస్తున్న కుక్కపై దాడికి చిరుత యత్నించింది. చిన్నపాటి శబ్ధాన్ని కూడా కుక్క ఇట్టే పసిగట్టేస్తుందని తెలిసిన చిరుత ఎలాంటి చప్పుడు కాకుండా కుక్క వద్దకు చేరుకుంది. దాని  తలను నోట్లో పెట్టుకునే ప్రయత్నం చేసింది. 

అయితే అప్పుడే కుక్క మేలుకుంది. దీంతో చిరుత అఖరి నిమిషంలో తన పట్టును కోల్పోయింది. చిరుత దాడి నుంచి తప్పించుకున్న కుక్క అక్కడి నుంచి పారిపోయింది. పారిపోతున్న కుక్కను చిరుత వెంబడించింది. అయితే అక్కడి సీసీటీవీలో ఆ పరిధిలోని దృశ్యాలే నమోదు కావడంతో ఆ తర్వాత ఏం జరిగిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటన గుజరాత్‌లోని అమ్రేలిలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో చూస్తున్న వారంతా కుక్కకు ఏమైందో అని ఆలోచిస్తున్నారు. 

Advertisement
Advertisement