నన్నుపెళ్లి చేసుకుంటావా.? | Sakshi
Sakshi News home page

షరపోవా.. నన్నుపెళ్లి చేసుకుంటావా.?

Published Tue, Nov 28 2017 12:33 PM

 Maria Sharapova gets marriage proposal from fan in Turkey, says ‘maybe’ - Sakshi - Sakshi - Sakshi - Sakshi

ఇస్తాంబుల్‌: ర‌ష్యా టెన్నిస్ క్రీడాకారిణి మ‌రియా ష‌ర‌పోవాకు వింత అనుభవం ఎదురైంది. ఈ మాజీ నెం1 ర్యాంకర్‌ మ్యాచ్ ఆడుతుండ‌గా ఓ అభిమాని పెళ్లి ప్ర‌పోజ‌ల్ చేశాడు. దానికి ఆమె ఇచ్చిన స‌మాధానం స్టేడియంలో ఉన్న వారందరికీ న‌వ్వులు పూయించింది.

ఐదు గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న షరపోవా.. వచ్చే గ్రాండ్‌స్లామ్‌ సీజన్‌ కోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇస్తాంబుల్‌లోని సినాన్ ఎర్దేం హాల్‌లో స్థానిక  ప్లేయర్‌ కాగ్ల బైకుకాకేతో మ్యాచ్ ఆడుతుండ‌గా ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. అప్పుడే బాల్ స‌ర్వ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న ష‌ర‌పోవాను 'మ‌రియా... న‌న్ను పెళ్లి చేసుకుంటావా' అని ఓ అభిమాని రష్యన్‌ భాషలో గట్టిగా అరిచాడు.

దీనికి ఏమాత్రం విసుగు చెందని షరపోవా ఓ రెండు క్ష‌ణాలు ఆలోచించి...'ఏమో!' అని స‌మాధాన‌మిచ్చింది. దీంతో అక్క‌డ ఉన్న వారంతా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌ అయింది.

Advertisement
 
Advertisement
 
Advertisement