ఎంత పద్దతిగా రోడ్డు దాటుతున్నాయో చూడండి

4 Apr, 2020 20:00 IST|Sakshi

ఏనుగుల గుంపు ఒకటి రోడ్డు క్రాస్‌ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోనూ ఇండియన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ పర్వీన్‌ కశ్వాన్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. కాగా ఆ వీడియోలో గున్న ఏనుగులను తల్లి ఏనుగులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాయనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. మొదట వీడియోలో ఒక ఏనుగు తన సమూహానికి ముందుండి నడిపించగా... దాని వెనకాలే గున్న ఏనుగులను మధ్యలో పెట్టుకొని మిగతా ఏనుగులు నడుచుకుంటూ పక్కనున్న పొదల్లోకి వెళ్లిపోయాయి. ఇంతవరకు బాగానే ఉంది.. అయితే కాసేపటికి మరికొన్ని ఏనుగులు గుంపు కూడా ముందు వెళ్లిన గుంపును అనుసరిస్తూ వడివడిగా అడుగులేస్తూ పరుగులు పెట్టాయి.

అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. ప్రసుత్తం మనుషుల్లో ఐకమత్యం కనిపించని వేళ.. ఏనుగుల్లో మాత్రం తమ పిల్లలను కాపాడుకోవడంలో ఎంత జాగ్రత్త వహిస్తున్నాయనేది కనిపిస్తుంది. ఈ వీడియోనూ పర్వీన్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ..' తమ గున్న ఏనుగులను మధ్యలో పెట్టుకొని అత్యంత పటిష్ట భద్రత నడుమ రోడ్డు దాటడం ఆసక్తి కలిగించిందంటూ' ట్వీట్‌ చేశారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన లభించింది. షేర్‌ చేసిన కొద్ది సేపటికే 4వేల లైకులు లభించాయి. ' అవి వాటి పిల్లలను జెడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రతతో తీసుకెళుతున్నాయి' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా