లేడీ డిటెక్టివ్‌గా త్రిష | Sakshi
Sakshi News home page

లేడీ డిటెక్టివ్‌గా త్రిష

Published Fri, Feb 2 2018 7:14 AM

Trisha's next Kuttrapayrichi is based on India's first female detective - Sakshi

తమిళసినిమా: లేడీ డిటెక్టివ్‌గా అవతారమెత్తనున్నారు నటి త్రిష. కథానాయకి డిటెక్టివ్‌గా నటించడం అన్నది కోలీవుడ్‌లో ఇదే ప్రప్రథం అన్నది గమనార్హం. నటి అనుష్క, నయనతారల తరువాత హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల అవకాశాలు నటి త్రిషనే వరిస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ చేతిలో మోహిని, గర్జన, పరమపదం విళైయాడు వంటి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలతో పాటు 96, చతురంగవేట్టై–2, 1818, తదితర 8 చిత్రాలున్నాయి. తాజాగా మరో కొత్త చిత్రానికి ఓకే చెప్పింది. దీనికి కుట్రపయిర్చి అనే టైటిల్‌ నిర్ణయించారు.  శ్రీ గురుజ్యోతి ఫిలింస్‌ పతాకంపై జీ.వివేకానందన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు వర్ణిక్‌ పరిచయం కానున్నారు. ఈయన దర్శకుడు బాలా వద్ద తారైతప్పటై్ట చిత్రానికి సహాయదర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం. 

ఈ చిత్ర విరాలను ఈయన తెలుపుతూ కుట్రపయిర్చి 1980లో సాగే నేర పరిశోధన కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఒక హత్య, దాని గురించి ఇన్వెస్టిగేషన్‌ ప్రధాన ఇతివృత్తంగా ఉంటుందన్నారు. ఇందులో త్రిష ప్రధాన పాత్రను పోషించనున్నారని తెలిపారు. ఆమె ఒక ప్రైవేట్‌ డిటెక్టివ్‌గా నటించనున్నారని చెప్పారు. హీరోయన్‌ డిటెక్టివ్‌గా నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇదే అవుతుందని అన్నారు. తొలి భారతీయ లేడీ డిటెక్టివ్‌ రజనీ పండిట్‌ను స్ఫూర్తిగా తీసుకుని త్రిష పాత్ర ఉంటుందని చెప్పారు. అయితే కుట్రపయిర్చి నిజసంఘటనల ఆధారంగా తయారు చేసిన కథ అని తెలిపారు.  ఇందులో త్రిషతో పాటు నటి సురభి, సూపర్‌ సుబ్బరాయన్‌ ప్రధాన పాత్రల్లో నటించనున్నారని తెలిపారు. దీనికి రథన్‌ సంగీతం, బాబుకుమార్‌ ఛాయాగ్రహణం అందించనున్నారని చెప్పారు. చిత్రం త్వరలోనే ప్రారంభం అవుతుందని దర్శకుడు తెలిపారు.

Advertisement
Advertisement